పాకిస్తాన్ మీద సర్జికల్ దాడులకు పాల్పడ్డాం అని భారత సైన్యం విస్పష్టంగా ప్రకటించిన తర్వాత.. జాతి మొత్తం వారికి సంఘీ భావంగా నిలుస్తోంటే అరవింద్ కేజ్రీవాల్ లాంటి మేధావులు మాత్రం.. అందుకు ఆధారాలు చూపాల్సందేనంటూ.. పాక్ అనుకూల ఉద్యమాన్ని లేవనెత్తుతున్నారు. అయితే తాజాగా ఇలాంటి డిమాండ్లు చేస్తున్నందుకు అరవింద్ కేజ్రీవాల్ ను సాక్షాత్తూ ఆయన గురువు , సామాజిక కార్యకర్త అన్నా హజారే తీవ్రంగా ఆక్షేపించడం విశేషం. సర్జికల్ దాడులకు ఆధారాలు అడగడం కరెరక్టు కాదు అంటూ అన్నా హజారే వ్యాఖ్యానించడం గమనించతగినది.
‘‘ఇది కరెక్టు కాదు. నేను దీనిని ఖండిస్తున్నా. ఈ విషయం భారత దేశానికి, సైన్యానికి, సరిహద్దు భద్రతకు సంబంధించినది. ఇలాంటి సమయంలో.. సైన్యాన్ని అపనమ్మకంతో చూడడం కరెక్టు కాదు’’ అని హజారే వ్యాఖ్యానించారు.
నిజానికి కాంగ్రెస్ కూడా ఇదే తరహా చిల్లర వ్యాఖ్యానాలు చేస్తోంది. అన్నా హజారే వంటి చిత్తశుద్ధి గల , దేశవ్యాప్తంగా గొప్ప గౌరవం, విశ్వసనీయత కలిగి ఉన్న అన్నాహజారే వంటి గొప్పవాళ్లు చెప్పిన తర్వాతనైనా.. కనీసం ఇలాంటి ప్రబుద్ధులు అందరూ సజావుగా ఆలోచించడాన్ని నేర్చుకోవాలని జనం కోరుకుంటున్నారు.