Chandrababu : జగన్ తో పోటీ పడుతున్నట్లుందిగా బాబూ? ఫీడ్ బ్యాక్ ఎలా ఉందో తెలుసా?
ఆంధ్రప్రదేశ్ లో నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తప్పులనే ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ లో నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తప్పులనే ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా చేస్తున్నారు. జగన్ కాంట్రాక్టర్లకు ఈ ప్రభుత్వం కూడా దోచి పెడుతుందని టీడీపీ నేతలే వ్యాఖ్యానిస్తున్నారు. కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకుండా నాటి ప్రభుత్వం ఏడిపించినట్లుగానే ఈ ప్రభుత్వం కూడా కాంట్రాక్టర్లను పక్కన పెట్టి నిధులన్నీ అమరావతిలోనే ఖర్చు చేస్తుంది. అమరావతి నిర్మాణానికి, సంక్షేమానికి చేసిన అప్పులు సరిపోతున్నాయంటున్నారు. 2014 నుంచి 2019 వరకూ కాంట్రాక్టు పనులు చేసిన టీడీపీ ముఖ్యమైన కార్యకర్తలకు కూడా ఇప్పటి వరకూ బిల్లులు రాకపోవడంతో వారు నేరుగా సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నారు. అలాగే ఇప్పుడు కూడా రహదారులను పీపీపీ పద్ధతిలో తీసుకు రావడం కూడా విమర్శలకు దారి తీసింది.
విద్యను దూరం చేసి...
చంద్రబాబు ప్రారంభించిన అమరావతి నిర్మాణాన్ని ఆపేయడం ద్వారా జగన్ కు నాడు నష్టం జరిగింది. జగన్ మొదలుపెట్టిన మెడికల్ కాలేజీల విషయంలో కూడా చంద్ర బాబుకు కూడా ఇలాగే జరగొచ్చన్నది సోషల్ మీడియాలో వినిపిస్తున్న అనేక కథనాలు స్పష్టం చేస్తున్నాయి. ఎయిడెడ్ విద్యా సంస్థలు మూసేసి పేదలకు నాణ్యమైన విద్య దూరం చేయడంతో పాటు నిర్బంధంగా ప్రైవేట్ విద్యా సంస్థలపై ఆధార పడేలా చేయడంతో ఉన్నత విద్యలో ఫీజు రీఎంబర్స్ మెంట్ రద్దు చేశారన్న విమర్శలను చంద్రబాబు క్షేత్రస్థాయిలో ఎదుర్కొంటున్నారు. జనం ఏమనుకుంటారో ఆలోచించారా అంటే, నిజమే... కొన్ని ఆలోచించి చేయాల్సిన పనులు కూడా ఉంటాయని చంద్రబాబు గుర్తు పెట్టుకుంటే మంచిదన్న హెచ్చరికలు వినిపిస్తున్నాయి.
ఉపాధ్యాయుల్లో అసంతృప్తి...
నాటి జగన్ ప్రభుత్వంలో ఉపాధ్యాయులు తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. నాడు ప్రవీణ్ ప్రకాష్ లేనిపోని నిబంధనలు తెచ్చి ఉపాధ్యాయులకు జగన్ ప్రభుత్వాన్ని సక్సెస్ ఫుల్ గా దూరం చేయగలిగారు. ఇప్పుడు విజయరామరాజు కూడా అదే పంథాలో కొనసాగుతున్నారు. ముస్తాబు పేరిట పాఠశాలల్లో విద్యార్థులను శుచిగా, శుభ్రంగా ఉంచడానికి చేయడాన్ని కూడా ఉపాధ్యాయులపై అదనపు భారం పడిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. , ఎయిడెడ్ స్కూల్స్ విషయంలో చాలా పెద్ద తప్పు జరిగింది,అలడే మెడికల్ కాలేజీలను పీపీపీ విధానంలో ప్రయివేటు వ్యక్తులకు అప్పగించడం కూడా విమర్శలకు దారి తీస్తుంది. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ మీద రగడ జరుగుతున్న తర్వాత ముఖ్యమంత్రికి సరైన ఫీడ్ బ్యాక్ అందడం లేదు అనిపిస్తోంది. వైసీపీ జనంలోకి తీసుకెళ్లడంలో సక్సెస్ అయింది. . ప్రైవేట్ సేవలు అంటే ప్రైవేట్ వ్యక్తులకు లబ్ది కలిగించడం అనే క్లారిటీ అందరికీ వచ్చేసినట్లే కనపించింది. ఏతా వాతా చెప్పేదేంటంటే.. జగన్ కు.. చంద్రబాబుకు పెద్దగా తేడా లేదనిపిస్తోంది.