Gold Price Today : ఇలా ఏడిపిస్తుందేంటయ్యా.. బంగారం.. వెండి ధర చూస్తే దడ మొదలవుతుందిగా?
ఈరోజు దేశంలో బంగారం ధర స్వల్పంగా తగ్గింది. వెండి ధరలు మాత్రం నిలకడగా ఉన్నాయి
బంగారం ధరలు ఎప్పుడు తగ్గుతాయో చెప్పటం కష్టమే. ఈ ఏడాది తొలి నుంచి ప్రారంభమై చివర వరకూ పసిడిప్రియులను బంగారం ఏడిపిస్తూనే ఉంది. ఇంతగా ధరలు పెరగడం గతంలో ఎన్నడూ లేదు. దాదాపు 70 శాతం బంగారం ధరలు పెరగడం అంటే మాటలు కాదు. అలాగే వెండి ధరలు కూడా అదే స్థాయిలో పెరుగుతుండటంతో వినియోగదారులు ఆందోళనకు గురవుతున్నారు. బంగారం విషయంలో స్పష్టత ఇవ్వలేకపోయినా.. రానున్న కాలంలో వెండి ధరలు భారీగా తగ్గుతాయని మాత్రం మార్కెట్ నిపుణులు అంచనాగా వినిపిస్తుంది. ఇప్పటికే కిలో వెండి ధరలు రెండున్నర లక్షలు దాటేసి కిలో మూడు లక్షల రూపాయలకు చేరువగా ఉంది. బంగారం ధరలు తగ్గకపోయినా... వెండి ధరలు తగ్గుతాయంటున్నారు.
ధరలు పెరుగుతూనే...
గత వారం నుంచి బంగారం, వెండి ధరలు పెరుగూతూనే ఉన్నాయి. అనేక కారణాలతో బంగారం, వెండి ధరలు పెరుగుతూనే ఉన్నాయి. అంతర్జాతీయ మార్కెట్ లో ధరల ఒడిదుడుకులు, విదేశాల్లో నెలకొన్న మాంద్యం, డాలర్ తో రూపాయి తగ్గుదల, ద్రవ్యోల్బణం, అమెరికా ఫెడరల్ మార్కెట్ లో వడ్డీ రేట్ల ప్రభావం వంటి కారాణాలతో బంగారం, వెండి ధరల్లో ఇటీవల కాలంలో భారీ మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ప్రస్తుతం ఫిబ్రవరి నెల వరకూ పెళ్లిళ్లు, శుభకార్యాల సీజన్ కూడా లేకపోవడంతో ధరలు తగ్గుతాయమోనని భావించినప్పటికీ ఆ అవకాశం లేదని చెబుతున్నారు. బంగారం ధరలు మాత్రం తగ్గే అవకాశం లేదని మార్కెట్ నిపుణులతో పాటు వ్యాపారులు కూడా అంటున్నారు.
వెండిపై ఇన్వెస్ట్ చేస్తే...
పెట్టుబడులు పెట్టే వారు ఎక్కువగా వెండిపై ఇన్వెస్ట్ చేయడం ఇటీవల కాలంలో ఎక్కువగా మారింది. వెండి పై పెట్టుబడులు పెట్టడం వెంటనే తీసివేసినా మంచి లాభాలు వస్తుండటంతో కొనుగోళ్లు భారీగా పెరిగాయంటున్నారు. ఈరోజు దేశంలో బంగారం ధర స్వల్పంగా తగ్గింది. వెండి ధరలు మాత్రం నిలకడగా ఉన్నాయి. ఉదయం ఆరు గంటలకు హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో నమోదయిన బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర1,29,440 రూపాయలుగా నమోదయింది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1,41,210 రూపాయలకు చేరుకుంది. కిలో వెండి ధర 2,73,900 రూపాయలుగా కొనసాగుతుంది. మధ్యాహ్నానికి బంగారం, వెండి ధరలలో మార్పులు కనిపించవచ్చు.