విజయ్ కాంత్ ఆరోగ్య పరిస్థితి విషమం

తమిళ హీరో, డీఎండీకే అధ్యక్షుడు విజయ్ కాంత్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. దీంతో ఆయనను ప్రత్యేక చికిత్స కోసం దుబాయ్ తరలించారు. విజయ్ కాంత్ గత [more]

Update: 2021-08-31 05:37 GMT

తమిళ హీరో, డీఎండీకే అధ్యక్షుడు విజయ్ కాంత్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. దీంతో ఆయనను ప్రత్యేక చికిత్స కోసం దుబాయ్ తరలించారు. విజయ్ కాంత్ గత కొంతకాలంగా అనారోగ్యంతో ఉన్నారు. ఇటీవల పుట్టిన రోజు వేడుకలు కూడా జరుపుకున్నారు. కానీ మాట్లాడేందుకు ఆయన ఇబ్బంది పడుతున్నారు. అలాగే లేచి నిలబడేందుకు కూడా ఆయనకు శక్తి సరిపోవడం లేదు. దీంతో ఆయనను దుబాయ్ కు తీసుకెళ్లి ప్రత్యేక వైద్యం అందిస్తున్నారు. విజయ్ కాంత్ కోలుకోవాలని ఆయన అభిమానులు, పార్టీ క్యాడర్ ప్రత్యేక ప్రార్థనలు జరుపుతున్నారు.

Tags:    

Similar News