అప్రూవర్ గా మారిన్ కెల్విన్… వారికి కష్టాలే
టాలివుడ్ డ్రగ్స్ కేసులో మరో సంచలనం నమోదయింది. ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ముందు అప్రూవర్ గా నిందితుడు కెల్విన్ మారారు. 6 నెలల క్రితం కెల్విన్ [more]
టాలివుడ్ డ్రగ్స్ కేసులో మరో సంచలనం నమోదయింది. ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ముందు అప్రూవర్ గా నిందితుడు కెల్విన్ మారారు. 6 నెలల క్రితం కెల్విన్ [more]
టాలివుడ్ డ్రగ్స్ కేసులో మరో సంచలనం నమోదయింది. ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ముందు అప్రూవర్ గా నిందితుడు కెల్విన్ మారారు. 6 నెలల క్రితం కెల్విన్ పై ఈడీ కేసు నమోదు చేసింది. ఎక్సైజ్ కేసు ఆధారంగా కెల్విన్ పై కేసు నమోదు చేసింది. అయితే గతంలో ఎక్సైజ్ అధికారుల విచారణలో కెల్విన్ నోరు మెదపలేదు. ఈడీ ముందు మాత్రం అప్రూవర్ గా మారిన కెల్విన్ సినీ పరిశ్రమ కు చెందిన అనేక మంది పేర్లు చెప్పినట్లు తెలిసింది. కెల్విన్ స్టేట్ మెంట్ ఆధారంగానే ఈడీ సినీప్రముఖులకు నోటీసులు జారీ చేసింది. కెల్విన్ అకౌంట్ లోకి సినీతారలు భారీగా నిధులను బదిలీ చేశారంటున్నారు. ఇప్పటికే కెల్విన్ బ్యాంక్ అకౌంట్లను ఈడీ సీజ్ చేసింది. సినీతారల అకౌంట్లను కూడా ఫ్రీజ్ చేయాలన్న యోచనలో ఈడీ అధికారులు ఉన్నారు.