Revanth Reddy : రేవంత్ రెడ్డి లవ్ స్టోరీ తెలుసా..?
రేవంత్ పొలిటికల్ లైఫ్ గురించి అందరికి తెలిసిందే. కానీ ఆయన పర్సనల్ లైఫ్ గురించి పెద్దగా ఎవరికి తెలియదు.
Revanth Reddy : తెలంగాణలో ముక్కుసూటి వ్యక్తిత్వంతో రెబల్ లీడర్ గా ఎంతో పాపులారిటీని సంపాదించుకున్న రేవంత్ రెడ్డి.. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ని అధికారంలోకి తీసుకు రావడంలో కీలక పాత్ర పోషించారు. కాలేజీలో చదువుతున్న సమయంలోనే స్టూడెంట్ లీడర్ గా భాద్యతలు నిర్వర్తించిన రేవంత్ రెడ్డి.. ఆ తరువాత ZPTC, MLA ఇండిపెండెంట్‌గా పోటీ చేసి విజయం సాధించారు. ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా గెలిచి టీడీపీలో జాయిన్ అయ్యారు.
ఆ తరువాత రాష్ట్రము విడిపోవడం, రేవంత్ రెడ్డి టీడీపీ నుంచి కాంగ్రెస్ రావడం జరిగాయి. అప్పటి నుంచి నేడు కాంగ్రెస్ ని అధికారంలోకి తీసుకు రావడంలో కీలక పాత్ర పోషించారు. ఇక ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ సీఎం అభ్యర్థిగా ఉన్నారు. ఆల్మోస్ట్ ఆయనే సీఎం అని అంటున్నారు. నేడు సీఎల్పీ సమావేశం ముగియగానే తెలంగాణ రాష్ట్ర రెండో ముఖ్యమంత్రి ఎవరు అన్నది అధికారికంగా తెలుస్తుంది. కాగా రేవంత్ పొలిటికల్ లైఫ్ గురించి అందరికి తెలిసిందే.
కానీ ఆయన పర్సనల్ లైఫ్ గురించి పెద్దగా ఎవరికి తెలియదు. రేవంతా రెడ్డి దివంగత నాయకుడు జైపాల్ రెడ్డి కుటుంబంలోని అమ్మాయి గీతారెడ్డిని పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఆమెను రేవంత్ రెడ్డి ప్రేమించి పెళ్లి చేసుకున్నారట. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఒక వార్త నెట్టింట వైరల్ గా మారింది.
రేవంత్ రెడ్డి, గీతారెడ్డి ప్రేమ కథ ఇంటర్మీడియట్ లోనే మొదలైందట. నాగార్జునసాగర్ లో ఫస్ట్ టైం ఈ ఇద్దరు కలిశారట. అక్కడ మొదలైన పరిచయం మంచి స్నేహంగా, ఆ తరువాత ప్రేమగా మారిందట. మొదట రేవంత్ రెడ్డే ప్రొపోజ్ చేశారట. ఇక రేవంత్ ముక్కుసూటి వ్యక్తిత్వం నచ్చడంతో గీతారెడ్డి కూడా వెంటనే ఓకే చెప్పేశారట. అలా ప్రేమ ప్రయాణం మొదలు పెట్టిన ఇద్దరు.. డిగ్రీ పూర్తయ్యాక ఇంటిలో వారికీ చెప్పి, ఒప్పించి 1992లో పెళ్లి చేసుకున్నారట.