Telangana : తెలంగాణలో కాంగ్రెస్ నేతల ఆందోళన
తెలంగాణలో బీజేపీ కార్యాలయం ముట్టడికి కాంగ్రెస్ నేతలు చేసిన ప్రయత్నం ఉద్రిక్తతలకు దారితీసింది.
తెలంగాణలో బీజేపీ కార్యాలయం ముట్టడికి కాంగ్రెస్ నేతలు చేసిన ప్రయత్నం ఉద్రిక్తతలకు దారితీసింది. గాంధీ భవన్ లో పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. బీజేపీ కార్యాలయాన్ని ముట్టడించడానికి బయలుదేరిన కాంగ్రెస్ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. నేషనల్ హెరాల్డ్ కేసులో గాంధీ కుటుంబాన్ని అక్రమంగా ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని, తప్పుడు కేసులు పెడుతూ వేధించే యత్నం చేస్తున్నారని కాంగ్రెస్ ఆరోపించింది. బీజేపీ నేతలు కూడా గాంధీభవన్ ముట్టడికి బయలుదేరారు.
రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు...
రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ కార్యాలయాలతో పాటు కరీంనగర్ లో కేంద్ర మంత్రి బండి సంజయ్ కార్యాలయాన్ని కూడా కాంగ్రెస్ నేతలు ముట్టడించడానికి ప్రయత్నించారు. దీంతో పెద్దయెత్తున పోలీసులు మొహరించారు. కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా, రాహుల్ గాంధీలపై తప్పుడు కేసులు నమోదు చేయడాన్ని నిరసిస్తూ ఆందోళన చేపట్టారు. గాంధీ భవన్ వద్ద పోలీసులు భారీగా మొహరించారు.