Telangana : పంచాయతీ తుది పోరులోనూ కాంగ్రెస్ కే ఆధిక్యం
తెలంగాణలో చివరి విడత పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాల్లో దూసుకుపోతుంది.
తెలంగాణలో చివరి విడత పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాల్లో దూసుకుపోతుంది. తెలంగాణలో చివరి విడత పంచాయతీ నేడు ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఈరోజు ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకూ పోలింగ్ జరిగింది. మధ్యాహ్నం రెండు గంటలకు సర్పంచ్, వార్డు సర్పంచ్ పదవులకు సంబంధించిన కౌంటింగ్ ప్రారంభమయింది. తెలంగాణలోని 3,753 సర్పంచ్, 28,410 వార్డు పదవులకు పోలింగ్ జరిగింది. మధ్యాహ్నం రెండు గంటలకు ప్రారంభమైన కౌంటింగ్ ఇంకా కొనసాగుతూనే ఉంది.
అందిన సమాచారం మేరకు...
ఇప్పటి వరకూ అందిన సమాచారం మేరకు ఇప్పటి వరకూ వచ్చిన ఫలితాల్లో కాంగ్రెస్ 540 సర్పంచ్ స్థానాల్లో విజయం సాధించింది. బీఆర్ఎస్ 170 స్థానాల్లో గెలిచింది. బీజేపీ నలభై ఐదు స్థానాల్లో గెలుపొందినట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. వార్డు సభ్యుల కౌంటింగ్ కూడా పూర్తవుతుంది. వార్డు సభ్యుల్లోనూ కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగిస్తుంది. స్వతంత్ర అభ్యర్థులు 126 స్థానాల్లో గెలిచినట్లు ఇప్పటి వరకూ అందిన లెక్కల ప్రకారం తెలుస్తుంది. అయితే లెక్కింపు పూర్తయిన గ్రామ పంచాయతీల వద్ద ఉప సర్పంచ్ ఎన్నికను కూడా వెంటనే ఎన్నికల అధికారులు నిర్వహిస్తున్నారు.
ఉప సర్పంచ్ పదవుల్లోనూ...
ఉప సర్పంచ్ పదవుల్లో అత్యధికంగా కాంగ్రెస్ కైవసం చేసుకుంది. తొలి, రెండు, మూడో విడతల్లోనూ కాంగ్రెస్ అత్యధిక స్థానాల్లో గెలిచింది. బ్యాలట్ పత్రాల ద్వారా కావడంతో ఓట్ల లెక్కింపు కాస్త ఆలస్యంగా జరుగుతుంది. అయితే మేజర్ గ్రామ పంచాయతీల్లో ఇంకా పోలింగ్ కొనసాగుతుంది. కౌంటింగ్ సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పంచాయతీ ఎన్నికలు కావడంతో గుర్తు లేకపోయినా ఆ యా పార్టీలు బలపర్చిన వారు ఎక్కువ మంది ఎన్నికవుతూ వస్తుండటంతో గ్రామాల్లో కోలాహలం నెలకొంది. ఈరోజు అర్ధరాత్రివరకూ కౌంటింగ్ కొనసాగే అవకాశాలున్నాయి.