Breaking : ఐదుగురు ఎమ్మెల్యేల అనర్హత పిటీషన్లు డిస్మిస్

తెలంగాణలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హతపై స్పీకర్ గడ్డం ప్రసాదరావు తీర్పు వెలువరించారు.

Update: 2025-12-17 10:46 GMT

తెలంగాణలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హతపై స్పీకర్ గడ్డం ప్రసాదరావు కీలక తీర్పు వెలువరించారు. ఐదుగురు ఎమ్మెల్యేలు పార్టీ మారిందని చెప్పడానికి సరైన సాక్ష్యాధారాలు నమోదు కాలేదు.అనర్హత పిటీషన్లను స్పీకర్ గడ్డం ప్రసాదరావు డిస్మస్ చేశారు. ఈరోజు కేవలం ఐదుగురు ఎమ్మెల్యేల పిటీషన్లపై మాత్రమే తీర్పు చెప్పారు. 2023 ఎన్నికల్లో బీఆర్ఎస నుంచి గెలిచిన పది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరారంటూ బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. దీనిపై స్పీకర్ ఎమ్మెల్యేల తరుపున వాదనలు విన్నారు.

పార్టీ  మారినట్లు ఆధారాల్లేవని...

బీఆర్ఎస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు తెల్లం వెంకట్రావు, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ప్రకాశ్ గౌడ్, గూడెం మహీపాల్ రెడ్డి, అరెకపూడికి గాంధీకి సంబంధించిన అనర్హత పిటీషన్లపై నేడు తీర్పు వెలువడింది. స్పీకర్ అనర్హత పిటీషన్లపై డిస్మిస్ చేస్తూ గడ్డం ప్రసాదరావు నిర్ణయం తీసుకున్నారు. సుప్రీంకోర్టు ఈ నెల 17వ తేదీలోపు పార్టీ మారిన ఎమ్మెల్యేలపై ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్పింది. దీంతో నేడు స్పీకర్ గడ్డం ప్రసాదరావు ఐదుగురు ఎమ్మెల్యలేకు సంబంధించి అనర్హత పిటీషన్లపై మాత్రమే తీర్పు వెలువరించారు. ఈ ఐదుగురిపై అనర్హత వేటు వేయడానికి స్పీకర్ తిరస్కరించారు.


Tags:    

Similar News