KTR : కేటీఆర్ నేటి నుంచి పల్లె బాట

పల్లెబాట పేరుతో కేటీఆర్‌ యాత్ర చేపట్టనున్నారు.

Update: 2025-12-18 05:07 GMT

పల్లెబాట పేరుతో కేటీఆర్‌ యాత్ర చేపట్టనున్నారు. యాదాద్రి జిల్లా కేంద్రంలో సర్పంచ్‌లుగా గెలిచిన వారితో కేటీఆర్ సమావేశం కానున్నారు. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో గెలిచిన బీఆర్ఎస్‌ అభ్యర్థులను అభినందించనున్న కేటీఆర్‌ వారికి గ్రామాభివృద్ధి కోసం ఏ మేరకు పనిచేయాలన్న దానిపై దిశానిర్దేశం చేయనున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి.

గ్రామాభివృద్ధికి కృషి చేయాలని...
గత మూడు దఫాలుగా జరిగిన పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించిన ప్రజలకు కూడా ఆయన కృతజ్ఞతలు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై వ్యతిరేకత కారణంగానే పల్లెల్లో బీఆర్ఎస్ కు పట్టం కట్టారని కేటీఆర్ అన్నారు. అలాగే గెలిచిన బీఆర్ఎస్ బలపర్చిన సర్పంచ్ లు, ఉప సర్పంచ్ లు, వార్డు సభ్యులు గ్రామాభివృద్ధికి కృషి చేయాలని కోరారు.


Tags:    

Similar News