Telangana : నేడు ఢిల్లీ నుంచి హైదరాబాద్ కు రేవంత్

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు ఢిల్లీ నుంచి హైదరాబాద్ కు రానున్నారు

Update: 2025-12-17 04:58 GMT

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు ఢిల్లీ నుంచి హైదరాబాద్ కు రానున్నారు. గత నాలుగు రోజుల నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలోనే ఉన్నారు. ఈ నెల 12వ తేదీ రాత్రికి ఢిల్లీకి బయలుదేరి వెళ్లిన రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఉండి పార్టీ పెద్దలను, కేంద్ర మంత్రులను కలిశారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, విద్యాశాఖ ధర్మేంద్ర ప్రదాన్ ను కలిశారు.

పలువురు కేంద్ర మంత్రులను కలసి...
యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు, ఉన్నత విద్యాసంస్థల్లో మౌలిక వసతుల కల్పన కోసం తెలంగాణ ప్రభుత్వం ముప్ఫయి వేల కోట్ల రూపాయలను ఎఫ్ఆర్ఎంబీ నుంచి మినహాయించాలని నిర్మలాసీతారామన్ ను కోరారు. అలాగే సోనియా గాంధీని కలిసి గ్లోబల్ సమ్మిట్ కు సంబంధించి విజన్ డాక్యుమెంట్ ను అందచేశారు. ఈరోజు మధ్యాహ్నం రేవంత్ రెడ్డి హైదరాబాద్ కు రానున్నారు.


Tags:    

Similar News