Telangana : నేడు మరో ముగ్గురి అనర్హత పిటీషన్లపై తీర్పు?
తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాదరావు నేడు మరొక ముగ్గురు ఎమ్మెల్యేల అనర్హత పై తీర్పు చెప్పే అవకాశముంది
తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాదరావు నేడు మరొక ముగ్గురు ఎమ్మెల్యేల అనర్హత పై తీర్పు చెప్పే అవకాశముంది. నిన్న ఐదుగురు ఎమ్మెల్యేలపై నమోదయిన అనర్హత పిటీషన్లను స్పీకర్ గడ్డం ప్రసాదరావు తోసి పుచ్చారు. వారు పార్టీ మారినట్లు ఆధారాలు లేవని తెలిపారు. మరొక ముగ్గురు ఎమ్మెల్యేల విషయంలో నేడు తీర్పు వెలువరించే అవకాశముందని తెలిసింది.
ఈ ముగ్గురి పిటీషన్లను...
కాలే యాదయ్య, సంజయ్ కుమార్, పోచారం శ్రీనివాసరెడ్డి కి సంబంధించిన అనర్హత పిటీషన్లపై నేడు స్పీకర్ నిర్ణయం వెలువరించే అవకాశముందని చెబుతున్నారు. మరొకవైపు స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాత్రం తాను బీఆర్ఎస్ లోనే కొనసాగుతున్నానని స్పీకర్ కు వివరణను లిఖితపూర్వకంగా పంపారు. దానం నాగేందర్ మాత్రం ఇంకా వివరణ ఇవ్వలేదు.