Revanth Reddy : కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల ప్రజలు విశ్వాసం ప్రకటించారు
కాంగ్రెస్ పట్ల ప్రజలు విశ్వాసాన్ని ప్రదర్శించారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు
కాంగ్రెస్ పట్ల ప్రజలు విశ్వాసాన్ని ప్రదర్శించారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. అధికారం పోయినా కొందరికి అహంకారం తగ్గలేదని అన్నారు. మూసీ లో కాలుష్యం కంటే ఒకాయన మాటల్లో విషం ఎక్కువని అన్నారు. 2029లోనూ ఈ ఫలితం రిపీట్ అవుతుందని రేవంత్ రెడ్డి చెప్పారు. ఈ ఫలితాలను కొందరు చూసి సంతోషపడుతున్నారని అన్నారు. అహంకారం, అసూయ తగ్గించుకోవాలని రేవంత్ రెడ్డి కోరారు. 94 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ 84 నియోజకవర్గాల్లో గెలిచిందని రేవంత్ రెడ్డి తెలిపారు. బీఆర్ఎస్ ఉన్నప్పుడు అద్భుతాలు జరిగినట్లుగా కొందరు మాట్లాడుతున్నారని కిషన్ రెడ్డిని ఉద్దేశించి అన్నారు. స్పీకర్ ఆధారాలను బట్టి నిర్ణయం తీసుకున్నారని తెలిపారు.
స్పీకర్ నిర్ణయం నచ్చకుంటే...
స్పీకర్ నిర్ణయం నచ్చకపోతే న్యాయస్థానాలున్నాయని రేవంత్ రెడ్డి అన్నారు. తాము 37 మంది సభ్యులం ఉన్నామని బీఆర్ఎస్ నేత హరీశ్ రావు పదే పదే చెబుతున్నారని రేవంత్ రెడ్డి తెలిపారు. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ అద్భుతమైన ఫలితాలను సాధించిందని రేవంత్ రెడ్డి చెప్పారు. కంటోన్మెంట్, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లోనూ కాంగ్రెస్ ను ప్రజలు ఆశీర్వదించారని అన్నారు. సొంత పార్టీ ఎమ్మెల్యేలను మా వాళ్లు కాదనే దుస్థితి ఎందుకు వచ్చిందని రేవంత్ రెడ్డి అన్నారు. కేసీఆర్ క్రియాశీలక రాజకీయాల్లో లేరని గజ్వేల్ ప్రజలే తీర్పు చెప్పారని రేవంత్ రెడ్డి అన్నారు. గజ్వేల్ లో మెజారిటీ స్థానాలను కాంగ్రెస్ గెలుచుకుందని రేవంత్ రెడ్డి తెలిపారు. కృష్ణా, గోదావరి జలాలపై మూడు రోజులు సభలో చర్చ పెడదామని రేవంత్ రెడ్డి అన్నారు.
సభలో చర్చిద్దాం....
కేసీఆర్ ఎప్పుడు అడిగితే అప్పుడు సభ పెడతామని రేవంత్ రెడ్డి చెప్పారు. కేసీఆర్ వచ్చి తగిన సూచనలు ఇస్తే తీసుకుంటామని తెలిపారు. గ్రామాల్లో ఎన్నికలు గ్రామ పరిస్థితులు బట్టి ఎన్నికలు జరుగుతాయని, అంతేతప్ప వేరేరకంగా చర్చించుకోవాల్సిన అవసరం లేదని రేవంత్ రెడ్డి అన్నారు. కేటీఆర్ నాయకత్వంలో అన్ని ఎన్నికలు ఓడిపోయారని హరీశ్ రావు వెనకనుంచి నాయకత్వం చేపట్టడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు. హరీశ్ రావు వర్గం ఇప్పటికే కేటీఆర్ కు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతుందని అన్నారు. హరీశ్ రావు నాయకత్వం మార్చాలని కోరుకుంటున్నాడని రేవంత్ రెడ్డి అన్నారు.