Telangana : ముగిసిన తుది విడత పంచాయతీ ఎన్నికలు

తెలంగాణలో చివరి విడత పంచాయతీ నేడు ఎన్నికల పోలింగ్ ముగిసింది

Update: 2025-12-17 07:42 GMT

తెలంగాణలో చివరి విడత పంచాయతీ నేడు ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఈరోజు ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకూ పోలింగ్ జరిగింది. మధ్యాహ్నం రెండు గంటలకు సర్పంచ్, వార్డు సర్పంచ్ పదవులకు సంబంధించిన కౌంటింగ్ ప్రారంభమవుతుంది. అనంతరం వైస్ సర్పంచ్ ఎన్నికలు కూడా జరపనున్నారు.

కాసేపట్లో కౌంటింగ్...
అయితే ఎక్కడా చెదురుమదురు ఘటనలు మినహా చివరి విడత ఎన్నికలు ప్రశాంతంగా ముగియడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఒంటి గంట వరకూ క్యూ లైన్ లో ఉన్న వారికి ఓటు వేసేందుకు అనుమతిస్తారు. తొలుత పోస్టల్ బ్యాలట్లను లెక్కిస్తారు. అనంతరం బ్యాలెట్ పేపర్లను లెక్కిస్తారు. నేడు చివర విడతగా తెలంగాణలోని 3,753 సర్పంచ్‌, 28,410 వార్డు పదవులకు పోలింగ్ జరిగింది. మూడో విడతలోనూ ఎలాంటి ఘర్షణలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.


Tags:    

Similar News