Revanth Reddy : సింగపూర్ లో కొనసాగుతున్న సీఎం టూర్
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన సింగపూర్ లో కొనసాగుతుంది.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన సింగపూర్ లో కొనసాగుతుంది. నిన్న పలువురు అధికారులు, పారిశ్రామికవేత్తలో రేవంత్ బృందం భేటీ అయింది. 3,500 కోట్ల రూపాయల పెట్టుబడులు తెలంగాణలో పెట్టేందుకు ఎస్టీ టెలీమీడిాయ గ్లోబల్ డేటా సెంటర్ ముందుకు రావడం మంచి పరిణామమని, దీనివల్ల వదల సంఖ్యలో ఉపాధి అవకాశాలు పెరుగుతాయని రేవంత రెడ్డి బృందం అభిప్రాయపడింది.
సింగపూర్ ప్రభుత్వంతో...
అలాగే సింగపూర్ ప్రభుత్వం తమతో కలసి పనిచేయడానికి కూడా అంగీకరించిందని తెలిపారు. పలు ప్రాజెక్టుల్లో సింగపూర్ ప్రభుత్వం భాగస్వామ్యం ఉండేలా చర్చలు జరుపుతున్నారు. సింగపూర్ వాణిజ్య, పర్యావరణ మంత్రి గ్రేస్ పు హై యీస్ తో నిన్న సమావేశమై చర్చించారు. సింగపూర్ లో ఉన్న తెలంగాణ ప్రజలతో కూడా సమావేశమై కాసేపు వారితో ముచ్చటించారు.