నేడు ఏపీ, తెలంగాణ టెన్త్ హాల్ టిక్కెట్లు విడుదల

పదో తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు నేడు హాల్ టిక్కెట్లు విడుదల కానున్నాయి

Update: 2026-03-05 03:58 GMT

పదో తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు నేడు హాల్ టిక్కెట్లు విడుదల కానున్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందని విద్యార్థులకు నేడుపదో తరగతి హాల్‌టికెట్లను విద్యాశాఖ అధికారులు విడుదల చేయనున్నారు. ఈ నెల 16 నుంచి ఆంధ్రప్రదేశ్ లో పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. అందుకే నేడు హాల్ టిక్కెట్లు విడుదల చేస్తున్నారు.

తెలంగాణలో 14 నుంచి...
తెలంగాణలో ఈ నెల 14 నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. హాల్ టిక్కెట్లను ఆ యా రాష్ట్రాలకు చెందిన ప్రభుత్వ అధికారిక వెబ్ సైట్ నుంచి డౌన్ లోడ్ చేసుకునే వీలుంది. ఏపీలో అయితే మనమిత్ర వాట్సప్ ద్వారా కూడా పొందవచ్చు. తెలంగాణ, ఏపీల్లో సంబంధిత పాఠశాలలకు వెళ్లి కూడా హాల్ టిక్కెట్లను పొందచవ్చని అధికారులు తెలిపారు.


Tags:    

Similar News