Hot Summer : అత్యవసరమైతే తప్ప పగలు బయటకు రావద్దు.. వస్తే ఇక అంతే

ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో గరిష్టంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.

Update: 2026-03-05 03:44 GMT

ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో గరిష్టంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మార్చి నెలలోనే రెండు రాష్ట్రాలు నిప్పుల కొలిమిని తలపిస్తున్నాయి. పగటి వేళ కర్ఫ్యూ వాతావరణం నెలకొంది. గతంలో ఎన్నడూ లేని విధంగా మార్చి మొదటి వారంలోనే భానుడు నిప్పులు చెరుగుతున్నాడు. దేశంలోనే అత్యధికంగా ఉష్ణోగ్రతలు ఇక్కడ నమోదవుతున్నట్లు వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. రికార్డు స్థాయికి ఉష్ణోగ్రతలు చేరుకోవడంతో రానున్న కాలంలో మరింత హీట్ వేవ్స్ ఉంటాయని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఏప్రిల్ నెల నుంచి ఇళ్ల నుంచి బయటకు రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటే మంచిదన్న సూచనలు వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు.

ఏపీలో గరిష్ట స్థాయికి చేరిన...
ఆంధ్రప్రదేశ్ లో ఎండల తీవ్రత ఎక్కువయింది. ఇప్పటికే 47 డిగ్రీల ఉష్ణోగ్రతలు పలుచోట్ల నమోదయ్యాయి. ప్రకాశం జిల్లాలోని వెలిగండ్ల మండలంలో అత్యధికంగా బుధవారం 47.6 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయినట్లు తెలిపింది. అలాగే పల్నాడు, కృష్ణా జిల్లాలోనూ 47 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని అమరావతి వాతావరణ శాఖ అధికారులు తెిలపారు. ఎలినినో ప్రభావంతో ఈ ఏడాది ఎండల తీవ్రత అధికంగా ఉంటుందని ముందుగానే వాతావరణ శాఖ అధికారుల అంచనా వేశారు. వాతావరణం పొడిగా ఉంటుందని, వడగాల్పుల తీవ్రత కూడా ఎక్కువవుతుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. గాలిలో తేమ శాతం తగ్గుతుందని, డీ హైడ్రేషన్ కు గురి కాకుండా తగినంత నీరును తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.
తెలంగాణలోనూ ఎక్కువయిన...
తెలంగాణలోనూ ఎండల తీవ్రత ఎక్కువయింది. ఉదయం పదకొండు గంటల నుంచి సాయంత్రం నాలుగు వరకూ వీలయినంత వరకూ బయటకు రాకపోవడమే మంచిదన్న సూచనలు వెలువడుతున్నాయి. బుధవారం వరంగల్ లో అత్యధికంగా 37 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. హైదరాబాద్ లో గరిష్టంగా 35 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇక నల్లగొండ, ఖమ్మం, కరీంనగర్, మెదక్, మహబూబ్ నగర్ జిల్లాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రానున్న కాలంలో వేడిగాలుల తీవ్రత కూడా పెరుగుతుందని హైదరాబాద్ వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. అత్యవసరమైతే తప్ప పగలు ఇంటి నుంచి బయటకు రావాలని, లేకుంటే ఇంటికే పరిమితమయితే మంచిదని సూచిస్తున్నారు.


Tags:    

Similar News