జైలు నుంచి విడుదలయిన బాల్క సుమన్

మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్ జైలు నుంచి విడుదలయ్యారు

Update: 2026-03-04 04:23 GMT

మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్ జైలు నుంచి విడుదలయ్యారు. ఆదిలాబాద్ జిల్లా జైలులో పథ్నాలుగు రోజుల పాటు రిమాండ్ నిందితుడిగా ఉన్న బాల్కసుమన్ కు బెయిల్ లభించడంతో ఆయన విడుదలయ్యారు. క్యాతనపల్లి మున్సిపాలిటీ ఎన్నికల సందర్భంగా మంత్రి వివేక్ కాన్వాయ్ పై దాడి జరిగిన కేసులో బాల్క సుమన్ తో పాటు మరికొందరిపై పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.

బెయిల్ రావడంతో...
అయితే ఈ కేసుల్లో బెయిల్ రావడంతో నేడు బాల్క సుమన్ జైలు నుంచి విడుదలయ్యారు. ప్రజాపాలన అంటే అక్రమ అరెస్టులు, నిర్భంధాలా? అని బాల్క సుమన్ ప్రశ్నించారు. తాను ఇక్కడ ఎంపీగా, ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ ఎవరిపైనా కేసులు నమోదు చేయించలేదని, వివేక్ మాత్రం ఈప్రంతంలో పరిస్థితిని మారుస్తున్నారని విమర్శించారు. తమ పార్టీ కౌన్సిలర్లను ప్రలోభపెట్టేందుకు ప్రయత్నించారని అన్నారు.


Tags:    

Similar News