Telangana : నేటితో అనర్హత పిటీషన్ విచారణ ముగింపు

నేటితో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అనర్హత పిటీషన్ విచారణ ముగియనుంది

Update: 2026-03-05 04:09 GMT

నేటితో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అనర్హత పిటీషన్ విచారణ ముగియనుంది. గత కొంత కాలంగా స్పీకర్ గడ్డం ప్రసాదరావు అనర్హత పిటీషన్ ఆరోపణలున్నఎమ్మెల్యేలను విచారిస్తున్నారు. గత ఎన్నికల్లో బీఆర్ఎ సుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీకి మారారని పది మంది ఎమ్మెల్యేలపై విచారణను స్పీకర్ చేపట్టారు. సుప్రీంకోర్టు ఆదేశాలో విచారణను వేగవంతం చేశారు.

ఎనిమిది మందికి...
ఇప్పటికే ఎనిమిది మందికి స్పీకర్ గడ్డం ప్రసాదరావు క్లీన్ చిట్ ఇచ్చారు. నేడు కడియం శ్రీహరి, దానం నాగేందర్ పిటిషన్లను స్పీకర్ విచారించనున్నారు. మధ్యాహ్నం 2.30 గంటలకు స్పీకర్ ఛాంబర్ లో విచారణ. మొదటగా కడియం శ్రీహరి పిటిషన్ పై విచారించనున్న స్పీకర్, అనంతరం దానం నాగేందర్ పిటిషన్ పై విచారణ చేపట్టనున్నారు. ఈఇద్దరి పిటీషన్లపై విచారణ ముగిసిన తర్వాత స్పీకర్ తీర్పును వెలువరించనున్నారు.


Tags:    

Similar News