Telangana : ఒక పదవి.. ముగ్గురు అభ్యర్థుల పోటీ
తెలంగాణ కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక నేడు జరగనుంది
తెలంగాణ కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక నేడు జరగనుంది. ఒక పదవి కోసం ముగ్గురు పోటీ పడుతున్నారు. తెలంగాణలో రెండు రాజ్యసభ స్థానాలు ఖాళీ అవుతుండగా రెండు స్థానాలు కాంగ్రెస్ కే దక్కనున్నాయి. అందులో ఒకటి ఇప్పటికే అభిషేక్ మను సింఘ్వికి ఖరారయింది. ఆయన హైదరాబాద్ కు కూడా చేరుకున్నారు. ఆయన ఈరోజు నామినేషన్ వేయాల్సి ఉండగా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ బయలుదేరి వెళ్లడంతో రేపు నామినేషన్ వేయాలని నిర్ణయించుకున్నారు.
నేడు రాజ్యసభ అభ్యర్థులకు...
ఇక ఈరోజు సాయంత్రం నాలుగు గంటలకు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, తెలంగాణ పార్టీ వ్యవహారాల ఇన్ ఛార్జి మీనాక్షి నటరాజన్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిలు జూమ్ సమావేశంలో మాట్లాడనున్నారు. హైకమాండ్ కు మూడు పేర్లను పరిశీలనుకు పంపినట్లు చెబుతున్నారు. ఇందులో వేం నరేందర్ రెడ్డి, వి.హనుమంతరావు, పుంజాల వినయ్ కుమార్ పేర్లను పంపినట్లు సమాచారం. రెడ్డి, బీసీ, ఎస్సీ సామాజికవర్గానికి చెందిన వారిలో ముగ్గురి పేర్లలో ఒక్కరిని ఖరారు చేయనున్నారు. సాయంత్రానికి ఆ ఒక్క అభ్యర్థి ఎవరో కాంగ్రెస్ నాయకత్వం తేల్చనుంది.