Telangana : నేడు కాంగ్రెస్ అభ్యర్థుల నామినేషన్లు

తెలంగాణ కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక పూర్తి కావడంతో నేడు నామినేషన్లను దాఖలు చేయనున్నారు

Update: 2026-03-05 02:33 GMT

తెలంగాణ కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక పూర్తి కావడంతో నేడు నామినేషన్లను దాఖలు చేయనున్నారు. నామినేషన్లనకు నేడు ఆఖరి తేదీ కావడంతో నేడు రాజ్యసభ అభ్యర్థులుగా అభిషేక్ మను సింఘ్వి, వేం నరేందర్ రెడ్డి నామినేషన్లు వేయనున్నారు. అధిష్టానం రెండు రాజ్యసభ స్థానాలకు అభిషేక్ మను సింఘ్వి, వేం నరేందర్ రెడ్డిల పేర్లను ఖరారు చేసింది.

తెలంగాణలో రెండు రాజ్యసభ స్థానాలు...
తెలంగాణలో రెండు రాజ్యసభ స్థానాలు ఖాళీ అవుతుండగా రెండు స్థానాలు కాంగ్రెస్ కే దక్కనున్నాయి. అయితే బీఆర్ఎస్ నామినేషన్ వేస్తుందా? లేదా? అన్నది మారి కాసేపట్లో తేలనుంది. ఇద్దరు కాంగ్రెస్ కు చెందిన రాజ్యసభ అభ్యర్థులు నేడు నామినేషన్ దాఖలు చేయనున్నారు.ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు హాజరు కానున్నారు. ఈ నెల 16వ తేదీన ఎన్నిక జరగనుంది.


Tags:    

Similar News