నేడు కొల్లాపూర్‌లో మంత్రి జూపల్లి పర్యటన

నేడు కొల్లాపూర్‌లో మంత్రి జూపల్లి కృష్ణారావు పర్యటిస్తున్నారు

Update: 2026-03-05 05:56 GMT

నేడు కొల్లాపూర్‌లో మంత్రి జూపల్లి కృష్ణారావు పర్యటిస్తున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రి పాల్గొంటున్నారు. జూపల్లి బాలమ్మ, వెంకట్రావు ప్రాంగణం దగ్గర సుజాత మదనమోహన్‌రావు భవనం ప్రారంభోత్సవంలో జూపల్లి కృష్ణారావు పాల్గొంటారని ఆ పార్టీ నేతలు వెల్లడించారు. అలాగే కౌసల్యమ్మ బాలకిషన్‌రావు కల్యాణమండపాన్ని ప్రారంభించనున్నారు.

ప్రారంభోత్సవాలు...
మంత్రి జూపల్లి కృష్ణారావు పర్యటన సందర్భంగా భారీగా కాంగ్రెస్ పార్టీ నేతలు, అభిమానులు హాజరవుతున్నారు. ఈ కార్యక్రమంలో మైహోం గ్రూప్ చైర్మన్ జూపల్లి రామేశ్వర్‌రావు హాజరు కానున్నారు. మంత్రి జూపల్లి కృష్ణారావు పర్యటన సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అలాగే ఈ కార్యక్రమాలకు సంబంధించిన ఏర్పాట్లు కూడా చేశారు.


Tags:    

Similar News