తెలంగాణ 10వ తరగతి పరీక్షల హాల్ టికెట్లు విడుదల.. డైరెక్ట్ గా డౌన్లోడ్ !
విద్యార్థుల హాల్ టికెట్లను ఆయా పాఠశాలలకు పంపించినట్లు ప్రభుత్వ పరీక్షల డైరెక్టర్ కృష్ణారావు తెలిపారు. పరీక్షలకు హాజరయ్యే..
హైదరాబాద్ : తెలంగాణలో 10వ తరగతి పబ్లిక్ పరీక్షల హాల్ టికెట్లు విడుదలయ్యాయి. విద్యార్థుల హాల్ టికెట్లను ఆయా పాఠశాలలకు పంపించినట్లు ప్రభుత్వ పరీక్షల డైరెక్టర్ కృష్ణారావు తెలిపారు. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు పాఠశాల ప్రధానోపాధ్యాయుల నుంచి హాల్ టికెట్లు పొందవచ్చని, లేదా విద్యాశాఖ వెబ్ సైట్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చని కృష్ణారావు పేర్కొన్నారు.
మే23న ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్ గ్రూప్ ఏ, ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్ 1 (కాంపోజిట్ కోర్స్), ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్ 2 (కాంపోజిట్ కోర్స్), మే 24న సెకండ్ లాంగ్వేజ్, 25న థర్డ్ లాంగ్వేజ్ (ఇంగ్లీష్), 26న మ్యాథమెటిక్స్ (లెక్కలు), 27న జనరల్ సైన్స్ (ఫిజికల్, బయోలాజికల్ సైన్స్), 28న సోషల్ స్టడీస్, 30న ఓఎస్‌ఎస్‌సీ మెయిన్ లాంగ్వేజ్ పేపర్ – 1 (సంస్కృతం, అరబిక్) పరీక్షలు జరగనున్నాయి. పరీక్షా కేంద్రంలోకి ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలకు అనుమతి లేదని విద్యాశాఖ ఇప్పటికే స్పష్టం చేసింది.