Telangana : మద్యం తాగితే లక్ష.. పట్టిస్తే పదివేలు
మద్యానికి దూరంగా ఉండాలని ఇప్పటికే పలు గ్రామాలు నిర్ణయిస్తున్నాయి.
మద్యానికి దూరంగా ఉండాలని ఇప్పటికే పలు గ్రామాలు నిర్ణయిస్తున్నాయి. మద్యం కారణంగా కుటుంబ వ్యవస్థ విచ్ఛిన్నమవ్వడమే కాకుండా సమాజంలోజరిగే వివిధ హింసాత్మక ఘటనలకు కూడా కారణమవుతున్నాయి. దీంతో గ్రామంలోని పెద్దలందరూ కలసి ఎవరూ మద్యం ముట్టకూడదని,అలా ముడితే భారీగా జరిమానా విధిస్తామని మద్యనిషేధాన్ని స్వచ్ఛందంగా అమలు చేసే ప్రయత్నంచేస్తున్నారు.
జనగామ జిల్లాలోని...
అందులో భాగంగా...జనగామ జిల్లాలోని పలు గ్రామాలు స్వచ్ఛంద మద్యపాన నిషేధాన్ని అమలు చేస్తున్నాయి. బచ్చన్నపేట మండలం కొడవటూర్, చిన్నరామన్ చర్ల, లింగంపల్లి, రఘునాథపల్లి మండలంలోని ఇబ్రహీంపూర్ లో మద్యపాన నిషేధ తీర్మానాన్ని కొనసాగిస్తున్నాయి. అయితే తీర్మానాన్ని ఉల్లంఘించి మద్యం అమ్మితే లక్ష రూపాయల జరిమానా, తాగిన వారిని, అమ్మినవారిని పట్టించిన వారికి పది వేలు నజరానా ప్రకటించి కఠినంగా మద్యపాన నిషేధాన్ని అమలు చేస్తున్నాయి.