బాధ్యతలు చేపట్టిన రవి గుప్తా

తెలంగాణ రాష్ట్ర కొత్త డీజీపీగా సీనియర్ ఐపీఎస్ అధికారి రవి గుప్తా

Update: 2023-12-03 16:49 GMT

తెలంగాణ రాష్ట్ర కొత్త డీజీపీగా సీనియర్ ఐపీఎస్ అధికారి రవి గుప్తా నియమితులయ్యారు. ఎన్నికల కోడ్ అతిక్రమించి కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుండగానే టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని కలిసిన తెలంగాణ డీజీపీ అంజనీ కుమార్‌పై ఎన్నికల సంఘం సస్పెన్షన్ వేటు వేసింది. ఆయన స్థానంలో రాష్ట్ర ప్రభుత్వం కొత్త డీజీపీని నియమించింది. ప్రస్తుతం విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగంతో పాటు ఏసీబీ డైరెక్టర్‌ జనరల్‌గా కొనసాగుతున్న సీనియర్ ఐపీఎస్ అధికారి రవి గుప్తాకు తెలంగాణ డీజీపీగా అవకాశం వచ్చింది. ఆయన 1990వ బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ అధికారి.

ఎన్నికల ఓట్ల లెక్కంపు ఓ వైపు జరుగుతుండగానే.. డీజీపీ అంజనీ కుమార్‌ రేవంత్ రెడ్డి ఇంటికి వెళ్లడంతో ఈ సస్పెన్షన్‌కు కారణం అయింది. అంజనీ కుమార్ వెంట మహేశ భగవత్, సంజయ్ కుమార్ జైన్ కూడా ఉన్నారు. వారిద్దరికి కూడా నోటీసులు ఇచ్చింది ఈసీ. రేవంత్ రెడ్డిని కలిసిన డీజీపీ పుష్పగుచ్ఛం అందించి విషెస్ తెలిపారు. రేవంత్‌కు భద్రత కల్పించే అంశంపై చర్చించారు. డీజీపీ అంజనీ కుమార్ వెళ్లి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని కలవడం వివాదాస్పదంగా మారింది. ఈ ఘటనపై ఎన్నికల సంఘం సీరియస్ అయ్యింది. ఎన్నికల కోడ్‌ను అతిక్రమించడంతో అంజనీ కుమార్‌పై సస్పెన్షన్ వేటు వేసింది.


Tags:    

Similar News