Kalvakuntla Kavitha : కేటీఆర్ కు ఏసీబీ నోటీసులు.. కవిత రెస్పాన్స్ ఇదే
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు ఏసీబీ నోటీసులు జారీ చేయడంపై ఎమ్మెల్సీ కవిత స్పందించారు.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు ఏసీబీ నోటీసులు జారీ చేయడంపై ఎమ్మెల్సీ కవిత స్పందించారు. ఫార్ములా ఈ రేసు కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు మరోసారి అవినీతి నిరోధక శాఖ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈ నెల 28వ తేదీన విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో తెలపడంతో ఆయన సోదరి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పందించారు. ఏసీబీ అధికారుల కేటీఆర్ కు నోటీసులు ఇవ్వడాన్ని ఖండిస్తున్నానని తెలిపారు.
వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు...
తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి, ప్రజా సమస్యలను పక్కదారి పట్టించేందుకు కుట్రపూరితంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ నోటీసులు ఇచ్చిందని కవిత పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి కుటిల రాజకీయ క్రీడలో భాగంగానే కేటీఆర్ కు నోటీసులు జారీ చేశారని కవిత అన్నారు. ఇది రాజకీయ దురుద్దేశ్యంతో కూడిన కేసు అని కవిత అన్నారు. ఎవరెన్ని ఇబ్బందులు పెట్టినా తట్టుకుని నిలబడిన చరిత్ర కేసీఆర్ సైనికులదంటూ ఆమె ఎక్స్ లో పో్స్టు చేశారు.