Weather Report : నేడు ఏపీ, తెలంగాణలలో వాతావరణం ఎలా ఉంటుందంటే?

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో చలి తీవ్రత పూర్తిగా తగ్గింది

Update: 2026-01-28 04:38 GMT

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో చలి తీవ్రత పూర్తిగా తగ్గింది. అయితే ఏజెన్సీ ప్రాంతాలైన కొన్ని చోట్ల మాత్రం సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో పొడి వాతావరణం నెలకొని ఉంటుందని వాతావరణ శాఖ వెల్లడించింది. కొన్ని చోట్ల వర్షాలు కురుస్తాయని తెలిపింది. రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో తేలిక పాటి నుంచి మోస్తరు వానలు పడతాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఉదయం పూట చలి తీవ్రత ఇంకా కొనసాగుతుంది. పొగమంచు కూడా ఎక్కువగా కొన్ని చోట్ల కనిపిస్తుంది.

కొన్ని చోట్ల వానలు...
ఆంధ్రప్రదేశ్ లో చలి తీవ్రత పూర్తిగా తగ్గుముఖం పట్టిందని అమరావతి వాతావరణ శాఖ వెల్లడించింది. క్రమంగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయని వెల్లడించింది. ప్రధానంగా మినుములూరు, అరకు, పాడేరు, లంబసింగి ప్రాంతాల్లో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మిగిలిన ప్రాంతాల్లో డబుల్ డిజిట్ డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వాతావరణ శాఖ అప్ డేట్ మేరకు కొన్ని ప్రాంతాల్లో అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని చెప్పింది. వాతావరణం ఒక్కసారిగా మారడంతో జ్వరం, ఒళ్లునొప్పులు, కళ్లుమంటలు వంటి వాటితో ప్రజలు ఇబ్బందులు పడే అవకాశముందని, ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.
తెలంగాణలో పొడి వాతావరణం...
తెలంగాణలోనూ దాదాపు చలి తీవ్రత తగ్గింది. ఆదిలాబాద్, సిర్పూర్ కాగజ్ నగర్, నిర్మల్, కుమ్రంభీం ఆసిఫాబాద్ వంటి ప్రాంతాల్లో చలి తీవ్రత కొంత కనిపిస్తున్నప్పటికీ మిగిలిన ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు పెరిగాయి. డబుల్ డిజిట్ టెంపరేచర్స్ నమోదవుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా పొడి వాతావరణం నెలకొని ఉంటుందని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. అదే సమయంలో తెలంగాణలో వానలు కురిసే అవకాశం లేదని కూడా చెప్పింది. ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. మధ్యాహ్నం వేళ అవసరమైతేనే బయటకు రావాలని, ఉదయం, సాయంత్రం వేళల్లో మాత్రమే పనులు చేసుకోవాలని చెబుతుంది.


Tags:    

Similar News