Telangana : రెండు గంటలుగా కొనసాగుతున్న సంతోష్ రావు విచారణ
ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ మాజీ ఎంపీ సంతోష్ రావు విచారణ కొనసాగుతుంది.
ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ మాజీ ఎంపీ సంతోష్ రావు విచారణ కొనసాగుతుంది. రెండు గంటలుగా సిట్ అధికారులు విచారణ చేస్తున్నారు. కేసీఆర్ కు అత్యంత దగ్గరగా ఉన్న వ్యక్తి కావడంతో ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆయన ప్రమేయంపై విచారణ సాగుతున్నట్లు తెలిసింది. మధ్యాహ్నం మూడు గంటలకు సిట్ కార్యాలయానికి సంతోష్ రావు విచారణకు హాజరయ్యారు.
కేసులో ప్రమేయంపై...
ఇంటలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ నియామకంపై ఎవరి ప్రమేయం ఉందన్న దానిపై ఆరా తీస్తున్నారు. సంతోష్ రావును ఫోన్ ట్యాపింగ్ కేసులో చెప్పిన విషయాలను రికార్డ్ చేస్తున్నారు. కొన్ని ఆధారాలను ప్రమేయం సంతోష్ రావు ముందు పెట్టి విచారణ చేస్తున్నారు. అయితే మరికొద్ది గంటల పాటు సంతోష్ రావును విచారించే అవకాశాలున్నాయి. విచారణ సందర్భంగా కొందరు ఇచ్చిన ఆధారాలతో సంతోష్ రావును సిట్ అధికారులు ప్రశ్నిస్తున్నట్లు తెలిసింది.