Telangana : నేడు బీజేపీ అభ్యర్థుల ప్రకటన
నేడు తెలంగాణలో మున్సిపల్ అభ్యర్థులను బీజేపీ ప్రకటించనుంది.
మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి తెలంగాణ వ్యాప్తంగా నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమయింది. తొలి రోజు నామినేషన్లు మాత్రం మందకొడిగానే సాగాయి. ఇంకా పార్టీలు అభ్యర్థులను ఖరారు చేయకపోవడంతో కొందరు మాత్రమే తమ నామినేషన్లను దాఖలు చేశారు. అయితే నేడు తెలంగాణలో మున్సిపల్ అభ్యర్థులను బీజేపీ ప్రకటించనుంది.
అందరికంటే ముందుగానే...
ఈరోజు సాయంత్రం తెలంగాణ బీజేపీ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి అభ్యర్థులను ప్రకటించనుంది. ఇతర పార్టీల కంటే ముందుగా అభ్యర్థులను ప్రకటించి ప్రచారంలో ముందుండాలని బీజేపీ వ్యూహాన్ని రచిస్తుంది. అందులో భాగంగా ఈరోజు సాయంత్రం బీజేపీ తెలంగాణలోని మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి అభ్యర్థులను ప్రకటించనుంది.