Telangana : తెలంగాణ ఐ సెట్ నోటిఫికేషన్ ఎప్పుడంటే?
తెలంగాణ ఐసెట్–2026 నోటిఫికేషన్‌ను ఫిబ్రవరి 6న విడుదల చేయనున్నట్లు అధికారులు తెలిపారు
తెలంగాణ ఐసెట్–2026 నోటిఫికేషన్‌ను ఫిబ్రవరి 6న విడుదల చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ ఫిబ్రవరి 12 నుంచి మార్చి 16 వరకు కొనసాగుతుంది.దరఖాస్తు ఫీజు ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు రూ.500గా, ఇతర అభ్యర్థులకు రూ.700గా నిర్ణయించారు. ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఈ ప్రవేశ పరీక్ష మే 13, 14 తేదీల్లో జరుగుతుంది. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్ష నిర్వహిస్తారు.
పరీక్షను...
టీజీఎడ్ సెట్ నోటిఫికేషన్ ఫిబ్రవరి 20న విడుదల కానుంది. ఏప్రిల్ 18 వరకు ఆలస్య రుసుము లేకుండా దరఖాస్తులు స్వీకరిస్తారు. టీజీ ఎడ్‌సెట్–2026 నోటిఫికేషన్‌ను ఫిబ్రవరి 20న విడుదల చేయనున్నారు. ఆలస్య రుసుము లేకుండా ఆన్‌లైన్ దరఖాస్తులు ఫిబ్రవరి 23 నుంచి ఏప్రిల్ 18 వరకు చేసుకోవచ్చు. టీజీ ఎడ్‌సెట్–2026కు సంబంధించిన పూర్తి షెడ్యూల్‌ను విడుదల చేశారు. రెండేళ్ల బీఈడీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఈ ప్రవేశ పరీక్ష మే 12న జరుగుతుంది. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల వరకు పరీక్ష నిర్వహిస్తారు.