Telangana : నేడు మున్సిపల్ ఎన్నికలకు నోటిఫికేషన్
నేడు తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల కానుంది
నేడు తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల కానుంది. నేటి నుంచి నామినఏసన్లను స్వీకరించనున్నారు. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు షెడ్యూల్ నిన్న విడుదలయింది. రాష్ట్రంలోని ఏడు కార్పొరేషన్ లకు, 116 మున్సిపాలిటీలకు ఎన్నికలకు సంబంధించి నేడు నోటిఫికేషన్ ను ఎన్నికల అధికారులు విడుదల చేయనున్నారు. నేటి నుంచి నామినేషన్లను స్వీకరించనున్నారు. ఈ నెల 30వ తేదీతో నామినేషన్ల స్వీకరణకు గడువు ముగియనుంది.
నేటి నుంచి నామినేషన్లు...
జనవరి 31వ తేదీన నామినేషన్లను ఎన్నికల అధికారులు పరిశీలిస్తారు. ఫిబ్రవరి 3వ తేదీన నామినేషన్ల ఉప సంహరణకు తుది గడువు విధించారు.ఫిబ్రవరి 11వ తేదీన పోలింగ్ ఉండనుంది. రీపోలింగ్ ఎక్కడైనా ఉంటే ఫిబ్రవరి 12వ తేదీన నిర్వహిస్తారు. ఫిబ్రవరి 13వ తేదీన ఓట్ల లెక్కింపు జరుగుతుంది. ఫిబ్రవరి 16న మున్సిపల్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్ల ఎన్నిక జరగనుంది. ఫిబ్రవరి 16న కార్పొరేషన్ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక జరగనంుది. మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా యాభై లక్షల మందికిపైగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.