అమెరికాలో తెలంగాణ యువకుడి మృతి
అమెరికాలో తెలంగాణకు చెందిన యువకుడు మృతి చెందారు
అమెరికాలో తెలంగాణకు చెందిన యువకుడు మృతి చెందారు. వనపర్తి జిల్లా వీపనగండ్ల మండలం బొల్లారం గ్రామానికి చెందిన సాఫ్ట్ వేర్ ఉద్యోగి హర్షవర్ధన్ రెడ్డి గుండెపోటుతో మరణించారు. హర్షవర్థన్ రెడ్డి వయసు నలభై ఐదేళ్లు. అమెరికాలోని ఫ్లోరిడాలోని తన నివాసంలో ఆయన గుండెపోటుతో మరణించారని అతని సన్నిహితులు తెలిపారు.
గుండెపోటుతో ...
తన నివాసంలో వర్క్ ఫ్రం హోం గుండెపోటు వచ్చి కొంతసేపటికే మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. హర్షవర్ధన్ రెడ్డి గత పదేళ్లుగా అమెరికాలో ఉంటున్నార. హర్షవర్థన్ రెడ్డికి భార్య, కుమారుడు ఉన్నారు. హర్షవర్ధన్ రెడ్డి తండ్రి సుదర్శన్ రెడ్డి బొల్లారం గ్రామ సర్పంచ్ గా ఉన్నారు. హర్షవర్ధన్ రెడ్డి మృతితో బొల్లారం గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.