Telangana : నేడు భారీగా దాఖలు కానున్న నామినేషన్లు

తెలంగాణ మున్సిపల్‌ ఎన్నికలకు నామినేషన్లు నేడు భారీగా దాఖలయ్యే అవకాశాలున్నాయి.

Update: 2026-01-29 06:05 GMT

తెలంగాణ మున్సిపల్‌ ఎన్నికలకు నామినేషన్లు నేడు భారీగా దాఖలయ్యే అవకాశాలున్నాయి. నిన్నటి నుంచి తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమయింది. నిన్న రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్‌ ఎన్నికలకు నిన్న 902 నామినేషన్లు దాఖలయినట్లు అధికారులు ప్రకటించారు. తొలి రోజు కావడంతో తక్కువ సంఖ్యలో దాఖలయ్యాయి.

రేపటి తో గడువు పూర్తి...
మున్సిపల్ వార్డులు, కార్పొరేషన్ల డివిజన్లకు సంబంధించిన అభ్యర్థులు నేడు కూడా నామినేషన్లను దాఖలి చేయనున్నారు. నామినేషన్ల దాఖలుకు రేపటితో గడువు ముగియనుంది. దీంతో నేడు అన్ని రాజకీయ పార్టీలు తమ పార్టీల అభ్యర్థులను ఖరారు చేసే అవకాశముంది. అందుకే ఈరోజు, రేపు భారీగా నామినేషన్లు దాఖలు చేసే అవకాశం ఉంది.


Tags:    

Similar News