నేను బీఆర్ఎస్ లోనే ఉన్నా : దానం నాగేందర్
స్పీకర్ ఇచ్చిన నోటీసులకు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సమాధానమిచ్చారు
స్పీకర్ ఇచ్చిన నోటీసులకు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సమాధానమిచ్చారు. అఫడవిట్ రూపంలో ఆయన స్పీకర్ కు తన సమాధానాన్ని అందచేశారు. తాను బీఆర్ఎస్ లోనే ఉన్నానని దానం నాగేందర్ అందులో పేర్కొన్నారు. తనను బీఆర్ఎస్ సస్పెండ్ చేసినట్లు తెలియదని దానం నాగేందర్ పేర్కొన్నారు. తాను 2024 మార్చిలో కాంగ్రెస్ పార్టీ సమావేశానికి వెళ్లిన మాట వాస్తవమేనని, అయితే వ్యక్తిగత హోదాలోనే వెళ్లానని దానం నాగేందర్ అఫడవిట్ లో పేర్కొన్నారు.
అనర్హత పిటీషన్ ను కొట్టివేయాలంటూ...
అందువల్ల తాను బీఆర్ఎస్ లోనే ఉన్నానని, తనపై నమోదయిన అనర్హత పిటీషన్ ను కొట్టి వేయాలని దానం నాగేందర్ తన అఫడవిట్ లో పేర్కొన్నారు. ఈరోజు ఉదయం స్పీకర్ గడ్డం ప్రసాదరావు అనర్హత పిటీషన్ పై వివరణ ఇవ్వాలంటూ ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కు నోటీసులు ఇవ్వడంతో ఆయన ఈ మేరకు అఫడవిట్ సమర్పించారు.