మూడు రోజులు కుండపోత
తెలంగాణలో రానున్న మూడు రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించింది
heavy rains alert to ap
తెలంగాణలో రానున్న మూడు రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మహబూబ్ నగర్, నాగర్‌కర్నూలు్, నారాయణ్‌పేట్, సంగారెడ్డి, వరంగల్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది.
ఈదురుగాలులు...
ఈ జిల్లాల్లో కుండపోత వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. గంటలకు నలభై నుంచి అరవై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశముందని తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పేర్కొంది. వాతావరణ శాఖ హెచ్చరికతో ప్రభుత్వం కూడా అప్రమత్తమయింది. ధాన్యం తడవకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.