Telangana : స్మితా సబర్వాల్ కు పోలీసులు నోటీసులు
ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ కు గచ్చిబౌలి పోలీసులు నోటీసులు జారీ చేశారు
ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ కు గచ్చిబౌలి పోలీసులు నోటీసులు జారీ చేశారు. కంచె గచ్చి బౌలి భూముల విషయంలో జింకలు, జంతువుల ఫొటోలను సోషల్ మీడియాలో ట్యాగ్ చేస్తూ రీపోస్టు చేయడాన్ని తప్పుపడుతూ స్మితా సబర్వాల్ కు నోటీసులు ఇచ్చారు. కంచె గచ్చి బౌలి భూముల వద్ద జంతువులు ఇబ్బందులు పడుతున్నాయని ఏఐ ఆధారంగా కొందరు తప్పుడు ఫొటోలను పెట్టారని ప్రభుత్వం ఆరోపిస్తుంది.
కంచె గచ్చి బౌలి భూముల
ప్రభుత్వ అధికారిణిగా ఉండి ఒక ఫేక్ పోస్టును రీట్వీట్ చేయడం పట్ల వివరణ ఇవ్వాలటూ స్మితా సబర్వాల్ కు నోటీసులు ఇచ్చారు. దీనిపై వివరణ ఇవ్వాలని ఆమెను కోరారు. కంచె గచ్చి బౌలి భూముల విషయంలో జంతువులు ఏమీ ఇబ్బంది పడలేదని, అక్కడ అస్సలు జంతువుల లేవని ప్రభుత్వం వాదిస్తున్న నేపథ్యంలో ఐఏఎస్ అధికారి అయిన స్మితా సబర్వాల్ ఇలా పోస్టు చేయడం వివాదంగా మారింది.