ఎల్లుండి బీఆర్ఎస్ నిరసనలు

గ్యాస్ సిలిండర్ల ధరల పెంపునకు వ్యతిరేకంగా ఎల్లుండి బీఆర్ఎస్ తెలంగాణ వ్యాప్తంగా నిరసనలు చేపట్టింది

Update: 2023-03-01 11:59 GMT

గ్యాస్ పెంపునకు వ్యతిరేకంగా ఎల్లుండి బీఆర్ఎస్ తెలంగాణ వ్యాప్తంగా నిరసనలు చేపట్టింది. ఈ మేరకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. గ్యాస్ సిలిండర్ ధర పెంపును వ్యతిరేకిస్తూ పెద్దయెత్తున నిరసనలు చేపట్టాలని నిర్ణయించారు. తాజాగా చమురు సంస్థలు గ్యాస్ సిలిండర్ ధరల పెంపుదలలో సిలిండర్ ధర 1,155 రూపాయలకు చేరిన సంగతి తెలిసిందే.

గ్యాస్ ధరల పెంపును...
దీనిని వ్యతిరేకిస్తూ బీఆర్ఎస్ ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టాలని నిర్ణయించారు. మహిళలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను మోదీ ప్రభుత్వం పట్టించుకోకుండా ధరలను పెంచుతూనే పోతుందని బీఆర్ఎస్ నేతలు ధ్వజమెత్తారు. మహిళలంతా ఏకమై మోదీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని కోరారు. మోదీ ప్రభుత్వ నిర్ణయాలను వ్యతిరేకించకపోతే ప్రజలపై భారం మోపుతూనే ఉంటారని అన్నారు. మోదీ ప్రభుత్వం తీరును నిరసించాలని మంత్రి కేటీఆర్ టెలికాన్ఫరెన్స్ లో కోరారు.


Tags:    

Similar News