"పవర్" మేనేజ్‌మెంట్ - సూత్రధారి ఎవరు?

టీడీపి - బీజేపికి పొత్తు‌ కుదర్చడం కోసం పవన్ కళ్యాణ్ రెండు మూడు దఫాలు ప్రయత్నం చేశాడు. అలా‌ అడిగిన ప్రతీసారీ.. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీల్చు చాలు! జగన్ మనకు ఫేవర్ గానే ఉన్నాడు. నువ్వు బలమైన ప్రతిపక్షంగా ఎదుగు. 2029 పరిస్థితులను బట్టి సీఎం అవుదువు అని పవన్ కళ్యాణ్‌ని ఢిల్లీ పెద్దలు చెప్పి ఒప్పించే ప్రయత్నం చేశారు.

Update: 2023-10-05 08:13 GMT

టీడీపి - బీజేపికి పొత్తు‌ కుదర్చడం కోసం పవన్ కళ్యాణ్ రెండు మూడు దఫాలు ప్రయత్నం చేశాడు. అలా‌ అడిగిన ప్రతీసారీ.. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీల్చు చాలు! జగన్ మనకు ఫేవర్ గానే ఉన్నాడు. నువ్వు బలమైన ప్రతిపక్షంగా ఎదుగు. 2029 పరిస్థితులను బట్టి సీఎం అవుదువు అని పవన్ కళ్యాణ్‌ని ఢిల్లీ పెద్దలు చెప్పి ఒప్పించే ప్రయత్నం చేశారు. ఇది 2022 జూన్ జులైలో జరిగిన ఘటన. అందుకు సమాధానంగా పవన్, ఏడు ఎనిమిదేళ్లు ఆగేంత ఓపిక లేదని తేల్చిచెప్పాడు. ఆ తర్వాత నుంచి టీడీపి వాళ్ళు జనసేన మైత్రికోసం చేసిన ప్రతీ అటెంప్ట్‌ని కళ్యాణ్ స్వాగతించాడు. అలా సీబీఎన్-కళ్యాణ్‌ల మీటింగ్ జరిగినప్పుడల్లా ఢిల్లీలో ఎవరో ఒకరు ప్రెస్మీట్ పెట్టి పవన్ తమవాడే అంటూ కిచిడీ చేసేసేవారు.

కానీ ఈ ఏడాది ఏప్రిల్ నుంచి పరిస్థితులు మారాయి. ముగ్గురు నేతలు పీకే, సీబీఎన్, లోకేశ్‌లు మూడు తరహా యాత్రలు చేపట్టి జగన్‌ని సఫొకేట్ చేసే ప్రయత్నం చేశారు. ఆ వ్యూహంలో ఈ ముగ్గురూ గెలిచారు. టీడీపి జనసేన పొత్తు కుదిరితే సీట్ల పంపకాలు, పవర్ మేనేజ్‌మెంట్ ఎలా ఉంటుందనే చర్చను క్యాడర్‌కు ఒదిలేసి వాళ్ళు మాత్రం సైలెంట్‌గా ముందుకెళ్ళిపోయారు. ఇటీవల కాలంలో వాలంటీర్ వివాదం రేగినప్పుడు.. సీబీఎన్ప.. వన్ కళ్యాణ్ పేరును పేర్కొని తనవైపు నుంచి పొత్తుపై ప్రజల్లో స్పష్టత ఏర్పడేలా మాట్లాడారు. ఆ తర్వాత నుంచి అఫిషియల్‌గా చెప్పకపోయినా.. చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌ల స్టేట్మెంట్స్ పొత్తుపై క్లారిటి ఇస్తూనే వచ్చాయి.
చంద్రబాబు అరెస్ట్ తర్వాత.. జనసేనాని టీడీపి, జనసేన కలిసి పోటీ చేస్తున్నాయని చెప్పేసారు. లోపల సీబీఎన్ తో జరిగిన సంభాషణ గురించి ఏమీ చెప్పలేదు కానీ.. జగన్‌కు సవాల్ విసిరి ఎన్నికల శంఖారావం పూరించారు. ఆ తర్వాత నుంచి మళ్ళీ నిన్న వారాహి యాత్రను తిరిగి ప్రారంభించారు. మధ్యలో లోకేశ్ ఢిల్లీ టూర్లలో కానీ, టీడిపి ప్రెస్మీట్లకు గానీ అటెండ్ అవలేదు. ఈ పరిణామం.. పవన్‌లో ఓ కొత్తకోణాన్ని చూపిస్తోంది. ఇంతకుముందు ఎప్పుడుపడితే అప్పుడు, ఎక్కడబడితే అక్కడ, ఎలా బడితే అలా మాట మార్చగలిగిన పవన్‌‌.. జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు అనిపిస్తోంది. కేంద్రంలో బిజేపి, సీబీఎన్ కి చెడిన సంబంధాలు అతనిని ఇంకా ఇరకాటం పెట్టే ప్రయత్నాలు చేయవచ్చేమో.. పార్టీ పెద్దలందరూ భయపడుతున్నట్టు రేపోమాపో లోకేశ్ కూడా అరెస్ట్ కావొచ్చేమో.. అలాంటి పరిస్థితులలో తను కోరుకున్న సీఎం ఛాన్స్ ఈసారే దక్కవచ్చేమో అన్న ఆలోచనతో పవన్ పావులు కదుపుతున్నారు అనిపిస్తోంది.
రెండు రోజుల నుంచి పవన్ కళ్యాణ్ టీడీపి నాయకులను కలుస్తూ, ఇరు పార్టీల కార్యకర్తలకి భరోసా ఇచ్చే మాటలు మాట్లాడుతున్నారు. మరోవైపు ర్యాడికల్ టీడీపి వర్గం వాళ్ళు.. సీబీఎన్ అరెస్ట్ తర్వాత లోకేశ్ బాబును సీఎం అంటూ నినాదాలు మొదలెట్టారు. ఇప్పుడు లోకేశ్ ఢిల్లీలో ఉంటూ అరెస్ట్‌ని తప్పించుకునే మార్గాలు వెతుకుతుంటే.. బ్రాహ్మణినే నెక్స్ట్ సీఎం అంటూ కొత్త ప్లకార్డ్‌లు ఎత్తుకున్నారు.
జనసేన కలయికని స్వచ్ఛందంగా స్వాగతించేలా లేరు తెలుగు తమ్ముళ్ళు. అలా అయితే పవన్ కళ్యాణ్‌కు పూర్తిగా సపోర్ట్ చేయాలి. సీఎం ఎవరనేది సీబీఎన్ చెప్తారు కదా.. ఆయన ఉత్తర్వులకోసం ఎదురుచూద్దాంలే అని కూడా అనుకోవడం లేదు వాళ్ళు. జైల్‌లో చంద్రబాబును పలుమార్లు కలిసి వచ్చిన కుటుంబసభ్యులు, న్యాయవాదులు ఎవరూ పవన్ కళ్యాణ్‌ని తిరిగి కలిసినట్టు కనిపించలేదు. ఇది చూస్తే దాల్ మే కుచ్ కాలా హై అనిపిస్తుంది‌.
సీబీఎన్ అరెస్ట్ అయితే పరిస్థితి ఏంటని పవన్ ప్లాన్ బీ వేసుకున్నారా? లేక పవన్ ఎంత చెప్పినా వినడం లేదని ప్రస్తుత పరిస్థితులు నెలకొనేలా ఢిల్లీ పెద్దలు ఏదైనా స్ట్రేటజీని అమలుపరిచారా అనిపిస్తోంది..


Tags:    

Similar News