BJP : జీవీఎల్ పేరు పరిశీలనలో ఉందటగా.. అదే జరిగితే?

మాజీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు తిరిగి కీలక పదవి పొందే అవకాశాలున్నాయి

Update: 2026-01-29 08:57 GMT

మాజీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు తిరిగి కీలక పదవి పొందే అవకాశాలున్నాయి. ఇప్పటి వరకూ ఆయనను కేంద్ర నాయకత్వం విస్మరించిందని భావిస్తుున్నప్పటికీ, త్వరలోనే ఆయనకు మరొక ముఖ్యమైన పదవి అప్పగించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలిసింది. అందుకే తాజాగా భారతీయ జనతా పార్టీ జీవీఎల్ నరసింహారావుకు కీలక బాధ్యతలను అప్పగించినట్లు ఏపీ బీజేపీలో పెద్దయెత్తున ప్రచారం జరుగుతుంది. దక్షిణాది రాష్ట్రాల్లో కేంద్ర బడ్జెట్ ద్వారా కలిగే ప్రయోజనాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు బీజేపీ ఈ నిర్ణయం తీసుకుందని అంటున్నారు. దక్షిణాది రాష్ట్రాల సమన్వయ కర్తగా జీవీఎల్ నరసింహారావు నియమించడం ఆయనకు తిరిగి పార్టీలో ప్రాధాన్యత దక్కుతుందంటున్నారు.

ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయాలన్నా...
జీవీఎల్ నరసింహారావు గత ఎన్నికల్లో విశాఖనుంచి పోటీ చేయాలని భావించారు. అంతకు ముందు ఆయన ఉత్తరప్రదేశ్ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించారు. ఆయన పదవీ కాలం ముగియడంతో మొన్నటి ఎన్నికల్లో ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయాలని భావించారు. అందుకు విశాఖ తనకు సరైన వేదిక అని భావించి అక్కడే నివాసం ఏర్పాటు చేసుకుని, కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. కానీ పొత్తులో భాగంగా మొన్నటి ఎన్నికల్లో విశాఖ పార్లమెంటు స్థానం టీడీపీకి వెళ్లిపోయింది. ఇప్పటి వరకూ జీవీఎల్ నరసింహారావు కు రాజ్యసభ పదవి కూడా దక్కలేదు. త్వరలో ఏపీ నుంచి ఖాళీ అయ్యే రాజ్యసభ పదవుల్లో జీవీఎల్ నరసింహారావు పేరు నామినేట్ చేసే ఆలోచనల్లో బీజేపీ పెద్దలు ఉన్నారని తెలిసింది.
త్వరలో ఖాళీ అయ్యే...
త్వరలోనే ఆంధ్రప్రదేశ్ లో రాజ్యసభ స్థానాలు ఖాళీ అవుతున్నాయి. అందులో ఒకటి ఖచ్చితంగా కూటమిలో మిత్రపక్షమైన బీజేపీకి ఒకటి తప్పనిసరిగా లభిస్తుంది. ఈసారి రాజ్యసభ పదవికి జీవీఎల్ నరసింహారావును నామినేట్ చేయడానికి బీజేపీ కేంద్ర నాయకత్వం కూడా సుముఖంగా ఉన్నట్లు సమాచారం.ఏపీలో సీనియర్ నేతగా ఉన్న జీవీఎల్ నరసింహారావు ను రాజ్యసభకు పంపితే ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ తమ బలంపెరిగే అవకాశాలున్నాయన్న అంచనాల్లో ఉంది. అందుకే ముందుగా దక్షిణాది రాష్ట్రాల సమన్వయకర్తగా బీజేపీ కేంద్ర నాయకత్వం జీవీఎల్ నరసింహారావును నియమించినట్లు పార్టీలో ప్రచారం జరుగుతుంది. ఇందులో నిజమెంత అన్నది తెలియాల్సి ఉంది.




Tags:    

Similar News