Ys Jagan : జగన్ చేయించిన సర్వేలో ఆశ్చర్యకరమైన విషాయాలు... అవేంటో తెలుసా?
వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఈ సారి అధికారంలోకి రావడం మాత్రం ఖాయమన్న ధీమాలో ఉన్నారు.
వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఈ సారి అధికారంలోకి రావడం మాత్రం ఖాయమన్న ధీమాలో ఉన్నారు. ఇప్పటికే గ్రౌండ్ లెవెల్ లో కూటమి ప్రభుత్వం పట్ల వ్యతిరేకత మొదలయిందన్న నివేదికలతో ఆయన ఈ వ్యాఖ్యలు చేస్తున్నారని అంటున్నారు. ఇటీవల వైసీపీ ప్రత్యేకంగా జనం మూడ్ ను సర్వే చేయించినట్లు పార్టీలో పెద్దయెత్తున ప్రచారం జరుగుతుంది. ఆ సర్వేలో కూటమి ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుందని చెబుతున్నారు. ప్రధానంగా ఉత్తరాంధ్ర, రాయలసీమల్లోనూ ఈ వ్యతిరేకత ఎక్కువగా ఉందని బయటపడిందని, కోస్తాంధ్రలో కొన్ని ప్రాంతాల్లో ఈ వ్యతిరేకత స్వల్పంగా ఉందని సర్వే నివేదికలు వెల్లడించినట్లు పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి.
ప్రతి ఏటా సర్వే చేయించాలని...
ఈసారి జగన్ ప్రతి ఏటా సర్వే చేయించాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది. ముంబయికి చెందిన ఒక సంస్థ కు ఈ సర్వే నిర్వహణ బాధ్యతను అప్పగించారని చెబుతున్నారు. ఇటీవల జనవరి నెలలో ఈ సర్వే జరిగిందని, ప్రతి జనవరి నెలకు ముందు ఒకసారి సర్వే నిర్వహించి తనకు నివేదిక ఇవ్వాలని ఆ సంస్థకు సర్వే బాధ్యతలను అప్పగించారంటున్నారు. దాని వల్ల ఏడాదిన్నర తర్వాత తాను ప్రారంభించే పాదయాత్ర ఎక్కువసేపు ఎక్కడ ఉండాలన్నది నిర్ణయించుకునేందుకు కొంత ఉపయోగపడుతుందని కూడా జగన్ భావించి ఈ నిర్ణయం తీసుకున్నారని తెలిసింది. ఏ ఏ అంశాలపై.. ఏ వర్గాలు కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నాయన్నది తనకు నివేదికలో తెలపాలని కోరినట్లు తెలిసింది.
ఈ నివేదికలో...
తొలిసారి అందిన నివేదికలో రైతులు తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారని నివేదికలో చెప్పారని, అలాగే మహిళలు, నిరుద్యోగులు కూడా అసంతృప్తితో ఉన్నారని వెల్లడయింది. ప్రభుత్వ ఉద్యోగులు, మధ్యతరగతి ప్రజలు మాత్రం కొంత కూటమి ప్రభుత్వానికి అనుకూలంగానే ఉన్నారని ఈ సర్వే నివేదికలో స్పష్టమయిందంటున్నారు. అందువల్ల ఆ వర్గాలను మంచి చేసుకోవడం ఏం చేయాలన్న దానిపైనా, ఎటువంటి హామీలు ఇవ్వాలన్న దానిపైనా జగన్ ఆలోచన చేస్తున్నారని, అందుకు తగినట్లుగానే ఉంటాయని చెబుతున్నారు. మొత్తం మీద ఎన్నికలకు మూడేళ్లకు ముందుగానే జగన్ సర్వేల ద్వారా నివేదికలను తెప్పించుకుని పార్టీని విజయం వైపు నడిపేందుకు సిద్ధమవుతున్నారని తెలిసింది.