హైదరాబాద్ లో సిట్ అధికారుల సోదాలు
ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ కేసులో స్పెషల్ ఇన్విస్టిగేషన్ అధికారులు హైదరాబాద్ లో సోదాలు నిర్వహిస్తున్నారు
ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ కేసులో స్పెషల్ ఇన్విస్టిగేషన్ అధికారులు హైదరాబాద్ లో సోదాలు నిర్వహిస్తున్నారు. నర్రెడ్డి సునీల్ రెడ్డికి చెందిన కంపెనీల్లో సోదాలను మధ్యాహ్నం నుంచి నిర్వహిస్తుంది. హైదరాబాద్, విశాఖలో ఈ తనిఖీలను గత నాలుగు గంటల నుంచి కొనసాగుతున్నాయి. హైదరాబదాద్ బంజారాహిల్స్ రోడ్డు నెంబరు 3లో లోని స్నేహ హౌస్ లోనూ, రోడ్ నెంబరు 2లో సాగర్ సొసైటీలోనూ, కాటేదాన్, రాజేంద్ర నగర్, ఖైరతాబాద్, కమలాపురి కాలని ఫేజ్ 1 లోని సంస్థ కార్యాలయాల్లో సిట్ అధికారుల సోదాలు నిర్వహిస్తున్నారు.
హైదరాబాద్, విశాఖలలో...
పలు కీలక డాక్యుమెంట్లను ఈ సోదాలలో్ స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. లిక్కర్ స్కామ్ లో సంపాదించిన సొమ్మును డొల్ల కంపెనీల ద్వారా పంపించేందుకు ప్రయత్నంలో భాగంగానే ఈ కంపెనీలను ఏర్పాటు చేసినట్లు అధికారులు చెబుతున్నారు. హైదరాబాద్ తో పాటు విశాఖపట్నంలోనూ ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తుండటంతో పలు కీలక మైన ఆధారాలు లభ్యమయ్యే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో సిట్ అధికారులు ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ కేసులో మరింత వేగంగా వెళుతున్నట్లే కనిపిస్తుంది.