Gold Price Today : బంగారం, వెండిని ఇక మర్చిపోండి.. మీరు కొనలేరంతే

ఈరోజు బంగారం ధరలు పెరిగాయి. వెండి ధరల్లో స్వల్ప పెరుగుదల కనిపించింది

Update: 2025-12-08 03:38 GMT

బంగారం ధరలు మరింత పెరుగుతాయి. అందులో ఏ మాత్రం సందేహం లేదు. ఎందుకంటే ఇప్పటికీ అనేక కారణాలతో బంగారం ధరలు పెరుగుతూనే ఉన్నాయి. కొనుగోలు పెద్దగా లేకపోయినా ధరలు పెరుగుతుండటంటతో ఇక ఆగే పరిస్థితి కనిపించడం లేదు. అంతర్జాతీయ ధరల్లో ఒడుదుడుకులు, ద్రవ్యోల్బణం, డాలర్ తో రూపాయి క్షీణించడం, పెట్టుబడి దారులు సురక్షిత ఆస్తుల వైపు మొగ్గు చూపుతుండటం, డాలర్ బలపడటం, ట్రంప్ తీసుకున్న నిర్ణయాలు, విదేశాల్లో నెలకొన్న మాంద్యం వంటి కారణాలతో బంగారం ధరలు మరింత పెరుగుతాయన్న అంచనాలు వినపడుతున్నాయి. వచ్చే ఏడాది ధరల పెరుగుదల మరింత ఎక్కువ ఉంటుందన్న అంచనాలున్నాయి.

ఎప్పటికీ గిరాకీ...
బంగారం, వెండి వస్తువులకు ఎప్పటికీ గిరాకీ ఉంటుంది. అందుకే ధరలతో సంబంధం లేకుండా అమ్ముడుబోయే వస్తువుగా బంగారం, వెండి వస్తువులను మాత్రమే చూస్తారు. ప్రస్తుతం సీజన్ కూడా నడవడం లేదు. పెళ్లిళ్లు, శుభకార్యాలు లేకపోయినా, మూఢమి కాలంలోనూ బంగారం, వెండి ధరలు ఎంతో కొంత పెరుగుతూ కొనుగోలు చేయాలని భావిస్తున్న వారిని ఆందోళనకు గురి చేస్తున్నాయి. పెళ్లిళ్ల సమయంలో బంగారం, వెండి వస్తువులకు, ఆభరణాలకు డిమాండ్ పెరిగి ధరలు పెరుగుతాయని ఊహించవచ్చు. కానీ నేడు మాత్రం కొనుగోళ్లు, సీజన్ తో సంబంధం లేకుండానే బంగారం, వెండి ధరలు పెరుగుతుండటంతో వినియోగదారులు ఇక కొనుగోలు చేయడం కష్టంగానే కనిపిస్తుంది.
ధరలు పెరుగుతూనే...
బంగారం, వెండి పెరుగుదల ఈ నాటిది కాదు. కొన్ని దశాబ్దాల నుంచి పెరుగుతూనే నేటికి చేరుకుంది. పది గ్రాముల బంగారం ధర లక్షన్నరకు, కిలో వెండి రెండు లక్షల రూపాయలు దాటతాయన్న అంచనాలు వినపడుతున్నాయి. ఈరోజు బంగారం ధరలు పెరిగాయి. వెండి ధరల్లో స్వల్ప పెరుగుదల కనిపించింది. ఉదయం ఆరు గంటలకు హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో నమోదయిన బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. కిలో వెండి ధరపై వంద రూపాయలు పెరిగింది. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1,19,300 రూపాయలుగా నమోదయింది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1,30,140 రూపాయలకు చేరుకుంది. కిలో వెండి ధర 1,95,800 రూపాయలుగా ట్రేడ్ అవుతుంది. ధరలు మరింత పెరిగే అవకాశముందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.


Tags:    

Similar News