Hyderabad : హైదరాబాద్ లో మూడు విమానాలకు బాంబు బెదిరింపు

హైదరాబాద్ లోని శంషాబాద్ విమానాశ్రయానికి వచ్చే మూడు విమానాలకు బాంబు బెదిరింపులు వచ్చాయి

Update: 2025-12-08 03:07 GMT

హైదరాబాద్ లోని శంషాబాద్ విమానాశ్రయానికి వచ్చే మూడు విమానాలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. కేరళలోని కన్నూర్ నుంచి వచ్చిన ఇండిగో ఎయిర్ లైన్స్ కు బాంబు బెదిరింపు ఈ మెయిల్ వచ్చింది. అలాగే ఫ్రాంక్ ఫడర్ట్ నుంచి హైదరాబాద్ కు వచ్చే లుఫ్తారా ఎయిర్ లైన్స్ కు కూడా బాంబు బెదిరింపు మెయిల్ అందింది.

బాంబు స్క్వాడ్ బృందాలతో...
లండన్ నుంచి హైదరాబాద్ కు వచ్చే బ్రిటీష్ ఎయిర్ లైన్స్ విమానానికి కూడా బాంబు బెదిరింపు మెయిల్ వచ్చినట్లు అధికారులు తెలిపారుు. దీంతో వెంటనే వీటిని శంషాబాద్ ఎయిర్ పోర్టులో ల్యాండ్ చేసి తనిఖీలు చేపట్టారు. బాంబు స్క్వాడ్ బృందాలతో పాటు డాగ్ స్క్కాడ్ బృందాలు కూడా తనిఖీలు చేసి ప్రయాణికులకు సురక్షితంగా కిందకు దించారు. అయితే ఈ మెయిల్స్ ఎక్కడి నుంచి వచ్చాయన్న దానిపై విమానాశ్రయ పోలీసు అధికారులు విచారణ చేపట్టారు.


Tags:    

Similar News