Gold Price Today : బంగారం కొనుగోలు చేయడం భవిష్యత్ లో కష్టమేనట
ఈరోజు దేశంలో బంగారం ధరలు పెరిగాయి. వెండి ధరలు భారీగా తగ్గాయి
బంగారం ధరలు ఎగబాకుతూనే ఉన్నాయి. బంగారం అంటే బంగారంగానే మారింది. అందరికీ భారంగా మారింది. గత కొద్ది రోజుల నుంచి బంగారం ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. అదే సమయంలో వెండి ధరలు కిలో రెండు లక్షల రూపాయలు దాటేసి చివరకు క్రమంగా దిగి వస్తున్నాయి. కానీ బంగారం ధరలు మాత్రం దిగి రావడం లేదు. అప్పుడప్పుడు కొంత ధరలు దిగి వస్తున్నట్లు కనిపిస్తున్నప్పటీకి ఇంకా ధరలు సామాన్యులు కొనుగోలు చేసే స్థాయికి బంగారం, వెండి ధరలు చేరుకోలేదు. బంగారం కొనుగోలు చేయడం భవిష్యత్ లో కష్టమే అవుతుంది. వెండి వస్తువులు ఇంట్లో కనిపించడం కూడా కష్టమేనని అనిపిస్తుంది. ఇలా ధరలు పెరగడం గతంలో ఎన్నడూ జరగలేదు.
భారత్ లోనే గిరాకీ...
బంగారం, వెండి వస్తువులకు భారత దేశంలో గిరాకీ ఎక్కువ. ఇప్పటి నుంచి కాదు.. కొన్ని దశాబ్దాల నుంచి బంగారానికి, భారతీయులకు విడదీయలేని సంబంధం ఉంది. ఏ రోజుల్లోనైనా బంగారం అనేది అపురూపమైన వస్తువే. బంగారం శరీరంపై ఉంటే మెరుపులతో పాటు భవిష్యత్ కు కూడా భద్రత అని భావిస్తారు. దీంతో పాటు శుభకార్యాల్లో ఎక్కువగా బంగారం, వెండి వస్తువులను వినియోగించడం సంప్రదాయంగా వస్తుంది. అందుకే భారత్ లోనూ అందులోనూ దక్షిణ భారతదేశంలోనే బంగారం, వెండి విక్రయాలు ఎక్కువగా జరుగుతున్నాయి. దక్షిణ భారత దేశంలో జరిగే బంగారం, వెండి విక్రయాలు.. భారత్ మొత్తంలో జరిగే కొనుగోళ్ల కంటే ఎక్కువని జ్యుయలరీ దుకాణాల యాజమాన్యం చెబుతుంది.
నేటి ధరలు...
దక్షిణ భారత దేశంలో ఎక్కువగా బంగారం జ్యుయలరీ దుకాణాలు కూడా ఉంటాయి. ప్రతి వీధిలో ఒక జ్యుయలరీ దుకాణం ఉండటానికి ఇదే కారణం. అందుకే బంగారం విషయంలో భారతీయులు తగ్గరంటే తగ్గరు. ఈరోజు దేశంలో బంగారం ధరలు పెరిగాయి. వెండి ధరలు భారీగా తగ్గాయి. పది గ్రాముల బంగారం ధరపై 280 రూపాయలు పెరిగింది. కిలో వెండి ధరపై నాలుగు వేల రూపాయలు తగ్గింది. ఈరోజు ఉదయం ఆరు గంటలకు హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో నమోదయిన బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1,19,110 రూపాయలుగా నమోదయింది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1,29,940 రూపాయలకు చేరుకుంది. కిలో వెండి ధర 1,95,900 రూపాయలుగా ట్రేడ్ అయింది.