సోషల్ మీడియాలో అభ్యంతకర పోస్టు.. కేసు నమోదు

ఎంఐఎం అధినేత ఒవైసీపై అభ్యంతరకరంగా సోషల్ మీడియాలో పోస్టు చేసిన వారిపై కేసు నమోదయింది

Update: 2025-12-06 12:32 GMT

హైదరాబాదు సైబర్‌ క్రైం పోలీసులు, ఎంఐఎం అధ్యక్షుడు హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీకి సంబంధించిన ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ తో తయారుచేసిన అవమానకర చిత్రాన్ని సోషల్ మీడియాలో పోస్టులు చేసిన గుర్తు తెలియని వ్యక్తులపై సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. బీఎన్ఎస్‌, ఐటీ చట్టాల కింద దర్యాప్తు ప్రారంభించారు.

ఎంఐఎం అధినేత ఒవైసీపై...
ఎంఐఎం సోషల్‌ మీడియా ఖాతాల నిర్వాహకుడు మహ్మద్ ఇర్ఫాన్ సైబర్‌క్రైం పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదు మేరకు పోలీసులు బీఎన్ఎస్‌, ఐటీ చట్టాల వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు అని తెలిపారు. కొందరు కావాలనే ఈ చిత్రాన్ని ఏఐ ద్వారా సృష్టించి సోషల్ మీడియాలో వైరల్ చేయడాన్నిసీరియస్ గా తీసుకున్న పోలీసులు దిశగా విచారణ చేస్తున్నారు.


Tags:    

Similar News