Gold Price Today : ఈ ఏడాదిలోనే బంగారం కొనాలకుంటున్నారా? అయితే మీకొక న్యూస్

ఈరోజు బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. వెండి ధరలు మాత్రం తగ్గాయి

Update: 2025-12-07 03:29 GMT

బంగారం అంటేనే భయపడే పరిస్థితి వచ్చేసింది. బంగారం, వెండి వస్తువుల విషయంలో ఇక తమ ఆసక్తిని చంపుకోవడమే బెటర్. ఎందుకంటే రానున్న రోజుల్లో బంగారం ధరలు మరింత పెరుగుతాయి. పెరుగుతున్న ధరలతో బంగారాన్ని కొనుగోలు చేయడం మధ్యతరగతి ప్రజలకు, వేతన జీవులకు మాత్రం సాధ్యం కాదు. ఎందుకంటే అంత డబ్బు పోసి బంగారం, వెండి కొనుగోలు చేసి అలంకరణకు ఉపయోగించడానికి కూడా ఎవరూ ఇష్టపడరు. అందుకే బంగారం విషయంలో ఆలోచనలు చాలా వరకూ మారాయి. అదే సమయంలో కొనుగోలు చేసే వారు తగ్గారా? అంటే చాలా వరకూ తగ్గారు కానీ అనుకున్న స్థాయిలో అమ్మకాలు జరగడం లేదని వ్యాపారులు చెబుతున్నారు.

డిమాండ్ తో సంబంధం లేకుండా...
కొనుగోలు చేసే వారు తగ్గినా, డిమాండ్ తో సంబంధం లేకుండా బంగారం ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. ఈ రేంజ్ లో పెరగడం గతంలో ఎన్నడూ చూడలేదు. పది గ్రాముల బంగారం ధర లక్షా ముప్ఫయి వేల రూపాయలకు చేరుకుంది. కిలో వెండి ధర రెండు లక్షలకు చేరువలో ఉంది. ఈ ధరలు డిసెంబరు చివరి నాటికి బంగారం, వెండి ధరలు మరింత పెరుగుతాయి. భారతీయ సంస్కృతిలో భాగమైన బంగారం, వెండి వస్తువులకు శుభకార్యాల సందర్భంలో గిరాకీ ఉంటుంది. అందుకే భారత్ లో బంగారం, వెండి వస్తువులను పండగలు, పుట్టిన రోజులకు కూడా కొనుగోలు చేయడం అలవాటుగా మార్చుకున్నారు. కానీ పెరిగిన ధరలతో మాత్రం వాటికి ఫుల్ స్టాప్ పెట్టేశారు.
పెట్టుబడి పెట్టేవారు మాత్రమే...
ప్రస్తుతం బంగారంపై పెట్టుబడి పెట్టేవారు మాత్రమే ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. వచ్చే ఏడాది ధరలు మరింత పెరుగుతాయన్న మార్కెట్ నిపుణుల సూచనలతో బంగారం బిస్కెట్లను ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. ఈరోజు బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. వెండి ధరలు మాత్రం తగ్గాయి. ఉదయం ఆరు గంటలకు హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో నమోదయిన బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1,19,300 రూపాయలుగా నమోదయింది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1,30,150 రూపాయలుగా కొనసాగుతుంది. కిలో వెండి ధర 1,90,000 రూపాయల వద్ద ట్రేడ్ అవుతుంది. మధ్యాహ్నానికి ధరల్లో మార్పులు కనిపించవచ్చు. స్థిరంగా ఉండొచ్చు. పెరగొచ్చు. తగ్గొచ్చు.


Tags:    

Similar News