Telangana : రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. హైదరాబాద్‌లోని పలు రోడ్లకు ప్రముఖుల పేర్లు పెడుతూ నిర్ణయం తీసుకున్నారు. ఫ్యూచర్ సిటీ ప్రధాన రహదారికి రతన్ టాటా పేరుగా నామకరనం చేశారు. అలాగే యూఎస్ కాన్సులేట్ రోడ్డుకు ట్రంప్ ఎవెన్యూగా నామకరణం చేశారు. గూగుల్ స్ట్రీట్ పేరుతో మరొక రహదారికి పేరు పెట్టారు.
ముఖ్యమైన రహదారులకు...
మైక్రోసాఫ్ట్ రోడ్, విప్రో జంక్షన్ల పేర్లను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిశీలిస్తున్నార. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం కేంద్ర విదేశాంగ శాఖకు లేఖ రాయనున్నట్లు తెలసింది. దీంతో పాటు అమెరికా రాయబార కార్యాలయానికి లేఖ రాయాలని నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ నగరం మరో న్యూయార్క్ నగరంగా మారుతుందని భావించి ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.