Hyderabad : విమానాల రద్దుతో రైళ్లకు పెరిగిన రద్దీ

ఇండిగో విమానాల రద్దుతో దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసింది.

Update: 2025-12-06 07:39 GMT

ఇండిగో విమానాల రద్దుతో దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసింది. ప్రయాణికుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. అలాగే అన్ని ప్రధాన రూట్లలో ఇప్పటికే వెళుతున్న రైళ్లలో అదనపు బోగీలను కూడా ఏర్పాటు చేయనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు ప్రకటించారు.

ప్రత్యేక రైళ్లను...
దక్షిణ మధ్య రైల్వే అధికారులు చెప్పిన దాని ప్రకారం సికింద్రాబాద్-చెన్నై, చర్లపల్లి-కోల్‌కతా, హైదరాబాద్-ముంబైకి ప్రత్యేక రైళ్లు నడుపుతున్నారు. అయితే ప్రత్యేక రైళ్లలో రిజర్వేషన్లు ఫుల్ అయ్యాయి. భారీగా వెయిటింగ్ లిస్ట్ కూడా ఉండటంతో ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా రైళ్ల సంఖ్య పెంచుతామని దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు.


Tags:    

Similar News