Revanth Reddy : గ్లోబల్ సమ్మిట్ అసలు లక్ష్యమిదే

తెలంగాణలో చైనా లోని గ్యాంగ్ డాంగ్ ప్రావిన్స్ స్ఫూర్తిగా అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు

Update: 2025-12-08 11:27 GMT

తెలంగాణలో చైనా లోని గ్యాంగ్ డాంగ్ ప్రావిన్స్ స్ఫూర్తిగా అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. తెలంగాణలోనూ గ్యాంగ్ డాంగ్ నమూనాను అమలు చేయదల్చామని చెప్పిన ముఖ్యమంత్రి చైనా, జపాన్, దక్షిణకొరియాలకు తమకు ఆదర్శమని రేవంత్ రెడ్డి తెలిపారు. అందుకే తెలంగాణను ప్యూర్, క్యూర్, రేర్ జోన్గుగా విభజించుకుని అన్ని రంగాల్లో అభివృద్ధి దిశగా వెళతామని చెప్పారు. ఏ రాష్ట్రం చేయని విధంగా మూడు జోన్లుగా తెలంగాణను విభజించుకుని అభివృద్ధి చేసుకుంటామని చెప్పారు ఇరవై ఏళ్లలోనే చైనాలోని గ్యాంగ్ డాంగ్ ప్రావిన్స్ అభివృద్ధి చెందిన విషయాన్ని గుర్తుకు తెస్తూ తాము కూడా తెలంగాణను ఇరవై ఏళ్లలో మూడు ట్రిలియన్ డాలర్లకు వెళ్లాలని ఒక గోల్ పెట్టుకున్నామని రేవంత్ రెడ్డి వివరించారు.

లక్ష్యం పెద్దదయినా...
అయితే తమ ముందున్న లక్ష్యం పెద్దదయినప్పటికీ అందరి ఆశీస్సులతో ముందుకు వెళతామని చెప్పారు. కొత్త రాష్ట్రమైన తెలంగాణలో ఐదు శాతం ఆదాయాన్ని దేశానికి అందిస్తున్నామని రేవంత్ రెడ్డి చెప్పారు. కష్టపడితే సాధించలేనిది ఏమీ ఉండదని అన్నారు ముఖ్యమంత్రి. తెలంగాణ రాష్ట్రం ఇప్పటికే అన్ని రంగాల్లో దూసుకు పోతుందని, అభివృద్ధిలోనూ ఇతర రాష్ట్రాల కంటే ముందుందన్నరేవంత్ ెడ్డి 2047కు సరికొత్త లక్ష్యాలను నిర్దేశించుకుని వెళుతున్నామని తెలిపారు. 2047 నాటికి మూడు ట్రిలియన్ డాలర్ల ఎకానమిగా ఎదగాలన్న లక్ష్యంతోనే వెళుతున్నామని, ఇందుకోసమే అందరి అభిప్రాయాలను తీసుకుంటున్నామని తెలిపారు. ఫ్యూచర్ సిటీలో జరుగుతున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ లో ఆయన మాట్లాడారు.


Tags:    

Similar News