Hyderabad : హైదరాబాద్ లో పోలీసులు ఆపరేషన్ కవచ్
హైదరాబాద్ లో ‘ఆపరేషన్ కవచ్’ పేరుతో పోలీసులు భారీ స్థాయిలో వాహన తనిఖీలు నిర్వహించారు
హైదరాబాద్ లో ‘ఆపరేషన్ కవచ్’ పేరుతో పోలీసులు భారీ స్థాయిలో వాహన తనిఖీలు నిర్వహించారు. టాస్క్‌ఫోర్స్, సిటీ ఆర్మ్డ్‌రిజర్వ్, స్థానిక పోలీస్‌స్టేషన్ల నుంచి సుమారు 5 వేల మంది సిబ్బంది ఈ ఆపరేషన్‌లో పాల్గొన్నారు. అసాంఘిక కదలికలపై నిఘా కోసమే ఈ నాకా బందీ అని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ తెలిపారు.
నాకా బందీతో...
నగరంలో అసాంఘిక కార్యకలాపాలు, అనుచిత కదలికలను అడ్డుకోవడం ఈ నాకా బందీ ధ్యేయమని ఆయన తెలపిారు. పౌరుల్లో భద్రతాభావం పెంచడంలో ఇది ఇప్పటివరకు నిర్వహించిన అతిపెద్ద చర్య అని సజ్జనార్ చెప్పారు. పరిశీలన కోసం 10 డ్రోన్లను కూడా ఉపయోగించారు. కమిషనర్ సజ్జనార్ మొత్తం ఆపరేషన్‌ను కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి పర్యవేక్షించారు. అనంతరం టోలిచౌకి, చార్మినార్ ప్రాంతాలకు వెళ్లి అక్కడి చెక్‌పాయింట్లను స్వయంగా పరిశీలించారు.